టాలివుడ్ కూల్ హీరో శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే.. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో పెద్దలు కుదుర్చిన అమ్మాయితోనే తన వివాహం అయ్యింది.. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు.. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్దార్థ్, అదితిరావు హైదరి తదితరులు పెళ్ళి లో సందడి చేశారు. అంగరంగ వైభవంగా రెండు రోజులు పాటు జరిగిన ఆ పెళ్లి సంబరంలో మ్యూజికల్ కాన్సర్ట్ ని కూడా నిర్వహించారు.
ఇక ఆ మ్యూజికల్ నైట్ లో స్టేజి పై కొందరు సింగర్స్ సిద్దార్థ్ నటించిన ఓ సినిమాలోని పాట పాడారు.. ఆ పాట వినగానే సిద్ధార్థ్ కూడా స్టేజ్ మీదకు వెళ్లాడు.. ఆ పాట పాడి అదరగొట్టేశాడు. ‘ఓయ్’ సినిమా లోని ‘ఓయ్ ఓయ్’ అనే సాంగ్ సిద్దార్థ్ పాడుతుంటే వెడ్డింగ్ లోని గెస్ట్స్ అంతా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ పెళ్లి వేడుకకు సిద్దార్థ్, అదితిరావు కలిసి రావడంతో మరోసారి వీరిద్దరి రిలేషన్సిప్ పై సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమంటున్నాయి..
అయితే మరో విషయమేంటంటే.. శర్వా పెళ్లి వేడుక అనంతరం సిద్దార్థ్.. అదితి తో కలిసి జైపూర్ దగ్గర వేరే ఊర్లో ఉంటున్న అదితి చుట్టాలింటికి వెళ్ళాడు.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రతి చోట ఇలా జంటగా కలిసి కనిపిస్తున్న వీరిద్దర్నీ ప్రేమలో ఉన్నారా? అని మీడియా ప్రశ్నిస్తే మాత్రం వీరిద్దరి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాదు.. శర్వానంద్ అండ్ సిద్దార్థ్ కాంబినేషన్ లో వచ్చిన మహా సముద్రం సినిమాలో అదితి.. సిద్దార్థ్ తో కలిసి పని చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..
Siddharth singing Oye Oye in Sharwanand Wedding👌🏻 pic.twitter.com/ZBzeacu1io
— Johnnie Walker (@roopezh) June 6, 2023