ITR Refund: ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్ ఇంకా క్రెడిట్ కాలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు 2023 జూలై 31వ తేదీని డెడ్ లైన్ గా విధించింది ఆదాపు పన్ను శాఖ. దీంతో ట్యాక్స్ చెల్లించిన వ్యక్తులు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది పొడవునా ఎక్కువ పన్ను ను చెల్లించిన వారు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి రిటర్న్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా చాలా మంది బ్యాంక్ ఖాతాల్లో రిటర్న్స్ డబ్బు జమ కాలేదు. కేవలం గడువు లోపు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడే కాదు ఫైల్ చేసిన తరువాత కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా మీ రీఫండ్ ప్రాసెస్ ను లేట్ చేయవచ్చు. ఐటీఆర్ సక్సెస్‌ఫుల్‌గా ఫైల్ చేసినప్పటికీ, ఇంకా వెరిఫై చేయకపోతే,ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌ని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణిస్తారు. అంటే అన్నీ చేసినా ప్రాసెస్ పూర్తి అయినట్లు భావించరు. రిటర్న్‌లో అందించిన సమాచారం ఖచ్చితత్వం, చట్టబద్ధతను నిర్ధారించడానికి వెరిఫికేషన్ అనేది కీలకమైన దశ. ఇది పూర్తికాకపోతే మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కాదు. అంతా సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం దీనిని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఆదాయపు పన్ను శాఖను సంప్రదించకుండా స్వయంగా చేసుకోవచ్చు.
Also Read: Lion: ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా.. ఆకులు తింటున్న సింహం
Also Read
మీరు గతంలో దీని కోసం ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ఉపయోగించి ఉంటే, ఇప్పుడు ఐటీఆర్‌ని వెరిఫై చేయడానికి ఆ కోడ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా జనరేట్ చేసుకోవచ్చు. అనంతరం ఐటీఆర్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఇక మరో విధంగా ఆధార్ నంబర్ ని ఉపయోగించి ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్ ) ని జనరేట్ చేసి ఆన్ లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. ఇంతకముందే ఈ ప్రాసెస్ చేసి ఉంటే కూడా దాని ద్వారా కూడా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఇక మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే దాని ద్వారా కూడా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉపయోగించి కూడా ఇ-వెరిఫికేషన్ చేయవచ్చు. సెక్యూర్, ఎఫిషియంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ని ఉపయోగించి ఇన్ ట్యాక్స్ రిటర్న్ పై డిజిటల్‌గా సంతకం చేయవచ్చు. మీరు కనుక ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉంటే చకచక ఈ ప్రాసెస్ లలో వెరిఫై చేసుసుకోండి. ఎందుకు మీకు ప్రాసెస్ ఆలస్యం అవుతుందో తెలుసుకోండి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!