Lion: ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా.. ఆకులు తింటున్న సింహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lion Eating Green Leaves: సింహం..దీన్ని చూస్తే గుండెల్లో భయం, దీని గాండ్రింపు వింటే కాళ్లలో వణుకు ఎవరికైనా పుట్టాల్సిందే. జంతువులలో సింహానికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అది ఎంత ఆకలిగా ఉన్నా వేరే జంతువులు వేటాడిన వాటిని ముట్టుకోదు. తానే స్వయంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అంతేకాదు ఎంత ఆకలిగా ఉన్నా మాంసాన్ని తప్పా గడ్డి, ఆకులు లాంటి వాటిని ముట్టుకోదు. అందుకే మన సామెతల్లో కూడా ఎంత ఆకలి వేసినా సింహం ఎలా గడ్డి తినదో ఎంత అవసరం ఉన్నా నేను తప్పు చేయను అని చెబుతూ ఉంటారు. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం అలాంటిదేముండదు అవసరమైనప్పుడు మనిషిలాగానే సింహం కూడా గడ్డి తింటుంది అనుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ వింత జరిగిన క్షణాల్లో దర్శనమిస్తోంది. చేతిలో కెమెరాలు ఉండటంతో ఆ వింతలను బంధించి చాలా మందితో పంచుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వింతే జరిగింది. క్రూరజంతువైన సింహం ఆకులు తింటూ కెమెరా కంటపడింది. దీంతో దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
Also Read: Viral Video: వీళ్లు నిజంగా సూపర్బ్ పోలీసులే.. స్కూటీపై వెంబడించి దొంగలను పట్టుకున్నారు
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
జీవితంలో మాంసం తప్ప వేరేది తినదు అనుకున్న సింహం ఓ చెట్టు ఆకులను పరాపరామని తినేస్తోంది. అంతేకాదు మిగిలిన జంతువులలాగా చెట్టు కొమ్మలను ఎగిరి అందుకోని మరీ తినేస్తోంది. ఒకటి రెండు కాదు ఆవులు, గేదెలు తిన్నట్లు కొమ్మలకు ఉన్న ఆకులు అన్నీ తినేస్తోంది. ఈ వీడియో చూస్తే ఏందయ్యా ఇది నేను చూస్తున్నది నిజమేనా అని అనుకోవడం పక్కా. ఇది భ్రమేమో అని కళ్లు తుడుకొని మరీ మళ్లీ ఈ వీడియోను చూస్తారు. సింహం ఏదైనా పూజ చేస్తుందేమో అందుకే నాన్ వెజ్ మానేసిందేమో అని దీనిని చూసిన కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నాన్ వెజ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు డైటింగ్ చేద్దామని ఈ సింహం డిసైడయినట్లు ఉంది అంటూ ఇంకొందరు అంటున్నారు. హింసను మానేసి అహింసలోకి వచ్చేసిందేమో అంటూ మరికొందరు స్పందిస్తు్న్నారు. మొత్తానికి ఆశ్చర్యం కలిగిస్తు్న్న ఈ వీడియో తాము చూడటంతో పాటు తమ వారికి కూడా షేర్ చేస్తున్నారు చాలా మంది.
- Tags
- Eating Leaves
- lion
- viral video
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!