రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Itel Aqua Launch: బడ్జెట్ మొబైల్ ఫోన్ల తయారీలో పేరుగాంచిన ఐటెల్ (itel) భారత మార్కెట్లో కొత్త ఫీచర్ ఫోన్ ఐటెల్ ఆక్వా (Itel Aqua)ను విడుదల చేసింది. కొత్తగా పరిచయం చేసిన ఇన్నో (Inno) సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్, USB టైప్-C ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
ఇందులో 2.4 అంగుళాల డిస్ప్లేను అందించారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా స్పష్టంగా కనిపించేలా మెరుగైన బ్రైట్నెస్ను అందించారు. ఫోన్లో ప్రాసెసర్, ర్యామ్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే మెమరీ కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజ్ విస్తరించుకునే అవకాశం ఉంది. అలాగే 1,000 కాంటాక్టులను సేవ్ చేసుకునే సామర్థ్యం, 250 SMS లు నిల్వ చేసుకునే సౌకర్యం, 60 కాల్ లాగ్లను భద్రపరచుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ఈ ఫీచర్ ఫోన్లో VGA రియర్ కెమెరాను అందించారు. కాల్స్ సమయంలో చుట్టుపక్కల ఉండే శబ్దాన్ని తగ్గించేందుకు AI ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్‌ను జోడించారు. దీంతో మాట్లాడే వ్యక్తి వాయిస్ మరింత స్పష్టంగా వినిపిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే “కింగ్ వాయిస్” అనే ద్విభాషా వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో మెనూ సూచనలు, కాల్ సమాచారం, నోటిఫికేషన్లను వాయిస్ ద్వారా తెలియజేస్తుంది.
వీటితోపాటు తెలుగు సహా మొత్తం 10 భారతీయ భాషలకు మద్దతు ఉంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, పంజాబీ, కన్నడ, మలయాళం భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్, వైర్లెస్ FM రేడియో, FM రికార్డింగ్ ఫీచర్లను అందించారు. బ్లూటూత్ ద్వారా ఫైళ్లను వైర్‌లెస్‌గా షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్లో 1,200mAh బ్యాటరీని అమర్చారు. USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. వీటితోపాటు సూపర్ బ్యాటరీ మోడ్, స్పీడ్ డయల్, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్, ఫోన్‌బుక్ రీడింగ్, టైమ్ అప్డేట్, కస్టమైజేషన్ వంటి పలు ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఐటెల్ ఆక్వా ఫోన్‌కు IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించింది. దీంతో వర్షం, నీటి చినుకులు, మట్టి, దుమ్ము వంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ సురక్షితంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రమాదవశాత్తు పడిపోవడం లేదా కఠిన పరిస్థితుల్లో ఉపయోగించినా తట్టుకునేలా దీన్ని రూపొందించినట్లు పేర్కొంది. భారత మార్కెట్లో ఏ ఫీచర్ ఫోన్ ధర రూ.1,799గా నిర్ణయించారు. ఇది బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Introducing itel Aqua of the innovative Inno series – India's only IP67-rated Feature Phone and the country's first AI ENC Feature Phone for crystal clear calls!
Powered by a big 1200mAh battery and convenient Type-C charging for everyday reliability! Featuring an India-First… pic.twitter.com/1k33rY1nxY
— itel India (@itel_india) June 1, 2026
తాజావార్తలు
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!