ITC Fined Rs 1 Lakh: సాధారణంగా బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు ఎవరైనా ఎన్ని బిస్కెట్లు ఉంటాయో.. ఎంత బరువు ఉందో అని గమనిస్తారా?. చాలా మంది అయితే లేదు అనే సమాధానం ఇస్తారు. కానీ ఓ వినియోగదారుడు మాత్రం తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్‌ను మొత్తం గమనించాడు. దీంతో రేపర్‌పై రాసిన బిస్కెట్ల సంఖ్య ప్రకారం ప్యాకెట్‌లో ఉన్న బిస్కెట్లలో ఒకటి తక్కువగా ఉందని ఏకంగా ఆ బిస్కెట్ ప్యాకెట్ తయారుచేసిన కంపెనీపై ఎఫ్ఎంసీజీ కోర్టులో కేసు పెట్టాడు. దీంతో ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోర్టు కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది.
చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్ ప్రాంతానికి చెందిన పి.ఢిల్లీబాబు అనే వ్యక్తి 2021, డిసెంబర్ నెలలో స్థానికంగా ఉండే ఓ రిటైల్ షాప్ నుంచి రెండు ప్యాకెట్ల సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఒక ప్యాకెట్‌లో 16 బిస్కెట్లకు బదులు 15 బిస్కెట్లు మాత్రమే కనిపించాయి. తనను ఎందుకు మోసం చేశారంటూ షాపు యజమానిని ప్రశ్నించాడు. అతడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఐటీసీ లిమిటెడ్‌ను మెయిల్ ద్వారా సంప్రదించాడు. అక్కడి నుంచి కూడా వినియోగదారుడికి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏకంగా వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోర్టు కంపెనీకి రూ. లక్ష జరిమానా విధించింది.
Also Read: Madhya Pradesh: ప్రేమికులని భావించి అన్నాచెల్లెలుపై దాడి.. రక్షాబంధన్ రోజు ఘటన
ఒక్కో బిస్కెట్ ధర 75 పైసలు అంటూ ఢిల్లీబాబు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ లెక్కల ప్రకారం ప్రతిరోజు రూ.29 లక్షల మేర వినియోగదారులను ఆ సంస్థ మోసం చేస్తోందని కోర్టుకు విన్నవించారు. దీనిపై ఐటీసీ వాదిస్తూ.. బిస్కెట్లను సంఖ్య ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా విక్రయిస్తున్నారని వాదించింది. సన్‌ఫీస్ట్ మేరీ లైట్ ప్రతి ప్యాకెట్‌పై నికర బరువు 76 గ్రాములుగా గుర్తించబడింది. అయితే, 15 బిస్కెట్లు ఉన్న ఒక్కో ప్యాక్ 74 గ్రాముల బరువు మాత్రమేనని కోర్టు గుర్తించింది. అస్థిర ఉత్పత్తుల విషయంలో మాత్రమే అటువంటి మినహాయింపు చెల్లుబాటు అవుతుందని ఐటీసీ వివరణను కోర్టు తిరస్కరించింది. ఈ నియమం బిస్కెట్లకు వర్తించదు. ఫోరం కంపెనీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ బిస్కెట్ల బ్యాచ్ అమ్మకాలను నిలిపివేసింది.