Italy Road Accident: ఇటలీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy Road Accident: ఇటలీలో నలుగురు భారతీయులు మృతి చెందారు. దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారని రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. మృతులు మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, వారి కారు ట్రక్కును ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
READ ALSO: Vijay Deverakonda: మొన్ననే ఎంగేజ్మెంట్.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ..!
Also Read
నలుగురు మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు..
పలు నివేదికల ప్రకారం.. గత శనివారం స్కాన్జానో జోనికో ప్రాంతంలో 10 మందితో ప్రయాణిస్తున్న ఏడు సీట్ల కారు ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 ఉండగా, అక్కడికక్కడే నలుగురు భారతీయులు మృతి చెందారు, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కుమార్ మనోజ్ (34), సింగ్ సుర్జీత్ (33), సింగ్ హర్విందర్ (31), సింగ్ జస్కరన్ (20) గా గుర్తించారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది.
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను తెలుసుకోడానికి స్థానిక ఇటాలియన్ అధికారులను సంప్రదిస్తున్నట్లు, సంబంధిత కుటుంబాలకు రాయబార కార్యాలయం అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తుందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. గాయపడిన వారిలో ఐదుగురిని పోలికోరో (మటేరా)లోని ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఆరవ వ్యక్తిని పోటెంజాలోని శాన్ కార్లో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గతంలో ఇద్దరు మరణించారు..
గతంలో ఇటలీలోని గ్రోసెటో సమీపంలోని ఆరేలియా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగ్‌పూర్ వ్యాపారవేత్త, ఆయన భార్య మరణించారు. ప్రమాదంలో వారి పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను నాగ్‌పూర్‌కు చెందిన ప్రసిద్ధ హోటల్ వ్యాపారి జావేద్ అక్తర్, ఆయన భార్య నాదిరా గుల్షన్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారి కుమార్తె అర్జూ అక్తర్, మరో కుమార్తె షిఫా, కుమారుడు జాజెల్‌లను ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!