IT Raids: లోకేశ్ సన్నిహితుడు, టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టింది. నారా లోకేశ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో మూడు బృందాలుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్, భారీ నిర్మాణ ప్రాజెక్టులు చేశారు గుణ్ణం చంద్రమౌళి. ఆయన ఇంట్లో దాదాపు 5 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read: Nara Lokesh: స్కిల్ కేసులో నారా లోకేశ్‌కు ఊరట
ఆక్వా, క్వారీ రంగంలో కూడా చంద్రమౌళి పెట్టుబడులు పెట్టారు. ఆదాయంలో తేడాలు చూపించి ఇన్‌కంట్యాక్స్‌లు ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. బినామీల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినట్లు గుర్తించారు.