Site icon NTV Telugu

Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?

Rohit Sharma Out

Rohit Sharma Out

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-టీం ఇండియా జట్ల మధ్య ఐదో(చివరి)టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ తప్పుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సిరీస్‌లో చివరి 3 మ్యాచ్‌ల్లో రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు. కాబట్టి రోహిత్ తనంతట తానుగా ఉపసంహరించుకున్నాడా లేదా.. నిజంగానే టెస్ట్ నుంచి రోహిత్‌ను తొలగించారా? అనేది తెలియాల్సి ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. కాగా.. సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకంజలో ఉంది. టీమ్ ఇండియా ఈ ఐదో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ ఆడడని ఓ కథనం వెలువడటం అభిమానులను నిరుత్సాహ పరుస్తోంది. రోహిత్ ఫామ్ చూస్తుంటే.. కెప్టెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనని కొందరు నెటిజన్లు అంటున్నారు.

READ MORE: India Pakistan: పాక్‌లో ఉగ్రవాదుల్ని చంపుతున్నది ఇండియానే.. వాషింగ్టన్ పోస్ట్ కథనం..

అయితే.. తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్ మాట్లాడారు. ఈ అంశంపై మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. మ్యాచ్‌ సమయానికే తుది జట్టును ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. రోహిత్‌తో సమస్యేమీ లేదన్నట్లుగా అతడు మాట్లాడాడు. “దేశం కోసం ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి.. జట్టులో ఏం మాట్లాడుకుంటున్నాం అనేది బయటకు రానీయకుండా చూసుకోవాలి. ఇక, కెప్టెన్ రోహిత్‌ శర్మతో నాకు ఇబ్బందేం లేదు.. ఫైనల్ టీంను మ్యాచ్‌కు ముందే ప్రకటిస్తాం. పిచ్‌ పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకుంటాం.. సిడ్నీ టెస్టులో ఎలా విజయం సాధించాలనేది ప్రతి ఒక్కరం చర్చించాం.. ఈ టెస్టు మాకు అత్యంత కీలకం.” అని పేర్కొన్నాడు. ఇక, ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ శర్మ గైర్హజరిపై ప్రశ్నించగా.. “ఇది సంప్రదాయమని నేను అనుకోవడం లేదు. హెడ్‌కోచ్‌గా నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చా.. అది సరిపోతుందనుకుంటా.. ఇక, బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని మేము సమం చేస్తాం.” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version