NTV Telugu Site icon

Ambati Rambabu: కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు

Ambati Rambabu

Ambati Rambabu

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో తన రెండో అల్లుడు, డాక్టర్ గౌతమ్ తన మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ చేశాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఇది నా ఫ్యామిలీ విషయం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి మా అల్లుడు చేసిన వ్యాఖ్యలపై కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ నా కుమార్తె మనోజ్ఞ పెళ్లికి కూడా వచ్చాడు. నా దృష్టి మరలచడానికే నా అల్లుడు చేత పోస్టులు పెట్టించి, రాజకీయం చేయాలని చూస్తున్నారు. నా కుమార్తె కుటుంబంలో మనస్పర్థలతో కూకట్ పల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై చేసుకున్నాడు. ఇది పూర్తిగా నా ఫ్యామిలీ విషయం. 13 తారీఖు ఎన్నికలు ఉన్న సందర్భంలో ఐదో తారీఖున ఒక వీడియో రిలీజ్ చేశాడు. నా అల్లుడు పవన్ కళ్యాణ్ కలుస్తాను, చంద్రబాబును కలుస్తానని బెదిరించాడని తెలిపారు.”

READ MORE: Israel Hamas War: హమాస్‌ వెస్ట్‌ బ్యాంక్‌ కమాండర్‌ హతం

నా కూతుర్ని అర్ధాంతరంగా వదిలేస్తే ఆమెను, ఆమె పిల్లల్ని సంరక్షిస్తున్నానని మంత్రి అన్నారు. విలేకర్లతో మాట్లాడుతూ.. “మనవడు, మనవరాలు భవిష్యత్తు తేలాలి కదా. ఇప్పటికి నా కూతుర్ని చదివించుకుంటున్నాను. తన కాళ్ళ మీద తన నిలబడాలని ఉద్దేశ్యంతో చదివించాను. ఇది కుటుంబ వివాదం కోర్టులో ఉంది దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. నా అల్లుడు మాటలు వెనక, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ విషయం తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం దుర్మార్గం. సత్తనపల్లిలో ఓడిపోతారని తెలిసిన తర్వాత ఇటువంటి, చౌకబారు ఎత్తుగడలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కుటుంబంలో కూడా ఇలాంటి సమస్య ఉంది. నాగబాబు కుటుంబంలో కూడా ఇలాంటి సమస్య ఉంది. నా మీద పోటీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో కూడా ఇలాంటి సమస్య ఉంది. కుటుంబాలు వేరు రాజకీయాలు వేరు. కోడెల కుటుంబ వివాదంలో నేను ఎంటర్ అవ్వలేదు. నీచ రాజకీయాలతో దృష్టి మరల్చి లబ్ధి పొందాలనుకుంటున్నారు. పవన్ మాట్లాడడం వల్ల మాట్లాడవలసి వచ్చింది. పవన్, బాబుకు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అల్లుడు కూతురి విషయంలో నా కూతురిని సఫ్ఫోర్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.”