కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చిన కేంద్ర హోం మంత్రి ఆధారాలు లేకుండా వైసీపీ, జగన్ పై ఆరోపణలు చేశారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. టీడీపీ ఇప్పటి వరకు చేస్తున్న ఆరోపణలే అమిత్ షా చేశార చెప్పారు. డీబీటీ ద్వారా 2 లక్షల 70 వేల కోట్లు ఒక్క రూపాయి అవినీతికి అవకాశం లేకుండా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా పాలన సాగిందన్నారు. బీజేపీ కేంద్రంలో ఉందని.. చెక్ చేస్తే అమిత్ షాకు తెలిసేదని పేర్కొన్నారు. చంద్ర బాబు హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అప్పుడు బీజేపీ ఆ కూటమిలో పార్టనర్ అని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ లో టీడీపీ పార్టనర్.. చంద్రబాబు అవినీతి చూడలేకే జనం 2019 లో చీకొట్టారన్నారు. కానీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం టీడీపీ ప్రభుత్వం ఏటీఎం అని ప్రధాని మోడీ అన్నారన్నారు. 2014 లో టీడీపీ జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చాయని.. 2017 వరకు పోలవరం విషయంను చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. చంద్ర బాబు పాపం వల్లే పోలవరం ఆలస్యం అయ్యిందన్నారు.
జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ కు వెళ్లి 8 వందల కోట్ల రూపాయలు వ్యయం తగ్గించారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సివేవీ రావడం లేదన్నారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి 2500 కోట్లు రీయింబర్స్మెంట్ రావాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణం ఉంటే చంద్రబాబు లోపం పాపమని.. ఒత్తిడికి గురి అవుతున్న బీజేపీ నాయకత్వం ది మాత్రమే అన్నారు. అన్ని మతాలను వైయస్ జగన్ గౌరవిస్తారన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభం ఒక ప్రైవేట్ కార్యక్రమన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తప్పడు ప్రచారంపై సీఐడీ కేసు మంచి పరిణామమని.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ఉద్ఘాటించారు.