Ministry of Jalshakti: మిషన్ భగీరథకు జాతీయ అవార్డుపై కేంద్ర జల శక్తి శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దమని కేంద్రం వెల్లడించింది. ఆ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని జలశక్తి శాఖ వెల్లడించింది. తెలంగాణలో 100శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదించిందని తెలిపింది. జల్‌జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలని.. కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించనేలేదన్నారు.
CM KCR : సీఎం కేసిఆర్ పర్యటనలో అపశృతి.. కాన్వాయ్ నుండి జారి పడ్డ మహిళా కానిస్టేబుల్
గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే అక్టోబరు 2న తెలంగాణకు అవార్డుకు ఎంపికైందని జలశక్తి శాఖ తెలిపింది. ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ డేటా ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాలలో శాంపిల్స్ పరీక్షించగా, 8శాతం నివాసాలు ప్రతిరోజు 55 లీటర్ల తలసరి నీటి కంటే తక్కువ తాగునీరు పొందుతున్నాయని పేర్కొంది. అదేవిధంగా మొత్త నమూనాల్లో 5శాతం నివాసాల్లో నీటి నాణ్యత జల జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించింది.