మిషన్ భగీరథకు జాతీయ అవార్డుపై కేంద్ర జల శక్తి శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దమని కేంద్రం వెల్లడించింది. ఆ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని జలశక్తి శాఖ వెల్లడించింది.
కేంద్ర జలశక్తిశాఖ ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. రూ.47,725 కోట్ల రూపాయలకు పోలవరం ప్రాజెక్టు అంచనాలను సవరించారు. ఈ అంచనాలను అంగీకరిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలను రేపు ఆర్ధిక శాఖలకు పంపించనున్నారు. పోలవరం సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలు పై వచ్చేవారం కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నది. పోలవరం ప్రాజెక్టును ఈ…