IT Employees: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. ప్రజా జీవితాలను అయోమయం చేసింది. అంతర్జాతీయంగా కోట్ల మంది ఉద్యోగులను కంపెనీలు ఇంటికి పంపించేశాయి. దీంతో జాబులు పొగొట్టుకుని ఉద్యోగులు రోడ్డునపడ్డారు. కోవిద్ టైంలో అన్నీ రంగాల్లోనూ కొద్దొగొప్పో లాభాల్లో ఉందంటే అది ఐటీ రంగం మాత్రమే. ఆ సమయంలో కంపెనీలు నష్టాలనుంచి తప్పించుకునేందు ఉద్యోగులను వర్కింగ్ హోంకు పరిమితం చేశాయి. ఇప్పుడదే వారి కొంపముంచింది. అయితే ఇటీవల అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. దిగ్గజ కంపెనీలు గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలే ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. ఇటీవల టీసీఎస్ ఉద్యోగులను తీసేసిందని వార్తలొచ్చాయి. మరోవైపు మూన్‌లైటింగ్ పేరుతో విప్రో 300 మంది ఎంప్లాయీస్‌ను తొలగించింది.
Read Also: Mohan Babu: వాడికి బాగా పొగరు.. నాతో సినిమా చేసి కూడా
ఇక ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గింది. దీంతో తమ ఉద్యోగుల్ని ఇక ఆఫీసులకు పిలిపించుకుంటున్నాయి. ఇప్పటికే టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ- మెయిల్స్ చేశాయి. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాలంటూ ఆదేశాలు సైతం జారీ చేశాయి. ఇన్ఫోసిస్ ఒక్కటే తమ ఉద్యోగులకు తమకు నచ్చిన విధానాన్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. అయితే.. ఉద్యోగులు ఇప్పుడు ఆ కంపెనీలను రివర్స్‌లో భయపెడుతున్నారట. ఆఫీసులకు రమ్మంటే రిజైన్ చేస్తామని చెబుతున్నారట. ఈ మేరకు ఒక సర్వేలో వెల్లడైంది. కంపెనీలకు మూన్ లైటింగ్ భయం పట్టుకుంది. ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఆఫీసులకు రమ్మంటున్న నేపథ్యంలో.. వారు ఇతర, తమకు అనుకూలంగా ఉన్న అనువైన ఉద్యోగాలను వెతికే పనిలో ఉన్నారట. స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ సర్వే ప్రకారం.. దాదాపు 88 శాతం ఉద్యోగులకు ఆఫీసులకు రమ్మని చెబితే ఉద్యోగాల నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నారట. దీంట్లో 46 శాతం మంది దాకా వర్కింగ్ మదర్స్ ఉన్నారు. వీరు, ఇంకా కేర్‌గివర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కోరుతున్నారు. 46 శాతం మంది అధిక వేతనం ఉండే జాబ్స్ కోసం వెతుకుతున్నారట. మిగతా 8 శాతం మంది మాత్రం.. తమను యజమానులు ఆఫీసు అనే చట్రంలో నిర్బంధిస్తారని, తమ అభిరుచులను ఇష్టపడరని చెప్పుకొచ్చారు.