Mohan Babu: వాడికి బాగా పొగరు.. నాతో సినిమా చేసి కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu: మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్ జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. అక్టోబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచేశారు మేకర్స్.. అందులో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.. 565 సినిమాలు.. 75 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను.. ఏఎన్నార్, ఎన్టీఆర్, ఎంజీఆర్, కృష్ణ, కృష్ణంరాజు గారి ఫంక్షన్స్ లో నన్నెవ్వరుఇలా మాట్లాడు.. ఇంతసేపు మాట్లాడు అని చెప్పలేదు.. కానీ నా కొడుకు విష్ణు మాత్రం నాన్న నువ్వు ఈరోజు చాలా తక్కువ మాట్లాడు అని చెప్పుకొచ్చాడు. అప్పుడు నాకే అనిపించింది అంత ఎక్కువ మాట్లాడుతున్నానా అని.. ఏదిఏమైనా ఆరోజులు వేరు.. ఈరోజులు వేరు. పురాణాల్లో చెప్పినట్లు మన గురించి మనం చెప్పుకోవాలి.. కానీ నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిడ్డలను పదిమందిలో పొగడకూడదు అనేది శాస్త్రం.. కానీ ఈ సినిమాలో విష్ణు చాలా అద్భుతంగా నటించాడు. ఎన్నో రిస్కీ షాట్స్ చేశాడు. సినిమాలు చెయ్.. కానీ ఇకముందు ఎప్పుడు ఇలాంటి రిస్క్ లు చేయొద్దు.
దేవుడి దయతో ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాకు ప్రాణం పోసింది కోన వెంకట్.. ఆ తర్వాత చోటా కె నాయుడు.. విష్ణు చోటా గురించి చెప్పినప్పుడు వాడికి పొగరు.. నాతో సినిమా చేసినప్పుడు కూడా.. కొంచెం అలాగే ఉండేది అని అంటే.. ఆలా ఏం లేదు చోటాగారు మంచివారు అని చెప్పడంతో ఒప్పుకున్నాను.. నిజం చెప్పాలి నా కొడుకును ఎంతో అందంగా చూపించాడు.. ఎంతో పనివంతుడు. ఇక అనూప్ సంగీతం హైలైట్.. నాతో సినిమా చేయమంటే చేయలేదు.. నేను హీరోగా పనికిరాను అనుకున్నాడేమో.. ఏదిఏమైనా విష్ణుకు, మా కుటుంబానికి మర్చిపోలేని ఆల్బమ్ ఇచ్చావ్.. థాంక్స్. డైరెక్టర్ సూర్య.. బాగా తీసాడు.. నీ ఓర్పు, సహనానికి మంచి ఫలితం వస్తుంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి చేశారు. సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
తాజావార్తలు
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!