PM Modi US Visit: ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు.. 2024లో సంయుక్తంగా మిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కీలక ఒప్పందం కుదిరింది. ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేశాయని వైట్‌హౌస్ గురువారం ప్రకటించింది. దీంతో 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంయుక్త మిషన్‌ను ప్రయోగించేందుకు ఇస్రో, నాసా అంగీకరించాయి. జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా ఓవల్ ఆఫీస్‌లో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల మధ్య సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ అధికారి మాట్లాడారు.. మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్ష పరిశోధన నిమిత్తం ఆర్టెమిస్ ఒప్పందంపై భారతదేశం, అమెరికా సంతకాలు చేయబోతున్నాయని చెప్పారు. ఆర్టెమిస్ ఒప్పందాన్ని 2020లో నాసా ప్రతిపాదించింది.
Also Read
Read Also:Yash: ఇంతకాలం ఆగి రిస్క్ చేస్తున్న యష్.. అసలు విషయం ఏంటంటే?
ఆర్టెమిస్ ఒప్పందం అంటే ఏమిటి?
ఆర్టెమిస్ ఒప్పందం పౌర అంతరిక్ష అన్వేషణలో ఒకే ఆలోచన కలిగిన దేశాలను ఒకచోట చేర్చింది. ఆర్టెమిస్ ఒప్పందం 1967 ఔటర్ స్పేస్ ట్రీటీపై ఆధారపడింది. ఆర్టెమిస్ ట్రీటీ అనేది 21వ శతాబ్దంలో పౌర అంతరిక్ష పరిశోధనలకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే నాన్-బైండింగ్ సూత్రాల ‘సెట్’. 2025 నాటికి మరోసారి చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
నాసా-ఇస్రో సంయుక్త అంతరిక్ష యాత్ర
మార్స్, ఇతర గ్రహాల వరకు అంతరిక్షాన్ని అన్వేషించడం దీని ఉద్దేశ్యం. 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంయుక్త అంతరిక్ష యాత్రను ప్రారంభించేందుకు ఇరు దేశాల ఏజెన్సీలు, నాసా, ఇస్రో అంగీకరించాయని అధికారి తెలిపారు.
Read Also:Revanth Reddy: అమర వీరుల పేర్లు లేకుండా.. స్థూపం ఏంటి?
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!