NTV Telugu Site icon

Israel Hamas War: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. 100 మంది పాలస్తీనియన్లు మృతి

Israel Hamas War

Israel Hamas War

Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలోని హమాస్‌కు భారీ నష్టం కలిగించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 158 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 100 మంది పాలస్తీనియన్లు మరణించారని, 158 మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా నివేదించింది. పాక్షిక కాల్పుల విరమణ తర్వాత, గాజాలో యుద్ధం కొనసాగుతుందని తెలిసిందే. ఇదిలా ఉండగా.. దీనిపై ఇంతవరకు ఇజ్రాయెల్‌ స్పందించకపోవడం గమనార్హం.

Read Also: Physical Harassment: సిమ్లాలో పంజాబ్‌ మోడల్‌పై అత్యాచారం

సమాచారం ప్రకారం.. అక్టోబర్ 7 నుండి గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 21,672 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇది కాకుండా, 56,165 మంది గాయపడ్డారు. గడిచిన 24 గంటల్లో 165 మంది పాలస్తీనియన్లు మరణించగా, 250 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 100 మంది మరణించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

సెంట్రల్ గాజా వైపు ఇజ్రాయెల్ సైన్యం
గాజాలోని అల్-బురేజ్, నుసిరత్, మేఘాజీలలో ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ ముఖాముఖిగా తలపడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాలు రణరంగంగా మారాయి. అదే సమయంలో, గాజా ఉత్తర, దక్షిణ ప్రాంతాల తర్వాత, ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు మధ్య ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఇక్కడ, గాజాలోని హమాస్ సొరంగాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం 65 మిలియన్ల డిజిటల్ ఫైల్స్, ఐదు లక్షల పేపర్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఫైల్‌లు హమాస్ సొరంగాలు, ఆర్థిక వనరులు, ప్రణాళికలు మరియు సంస్థకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని కలిగి ఉన్నాయి, వీటిని ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌ను నిర్మూలించడానికి ఉపయోగిస్తుంది.