Site icon NTV Telugu

Israel: గాజాలో ముగ్గురు బందీల మృతదేహాల స్వాధీనం

Gaza

Gaza

హమాస్ సృష్టించిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెలీయులను బందీలుగా తీసుకెళ్లిన ఓ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇజ్రాయెల్ మహిళా సైనికుల పట్ల క్రూరత్వం ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ముగ్గురు బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకుంది.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్‌కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..

అక్టోబరు 7న హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెలీయులు మరణించారు. వారికి సంబంధించిన మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. గాజా నుంచి హనాన్ యబ్లోంకా, మిచెల్ నిసెన్‌బామ్, ఓరియన్ హెర్నాండెజ్ రాడౌక్స్‌తో సహా ముగ్గురు బందీల మృతదేహాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది. ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సంయుక్త ఆపరేషన్‌లో హనన్ యబ్లోంకా, మిచెల్ నిసెన్‌బామ్ మరియు ఓరియన్ హెర్నాండెజ్ రాడౌక్స్ మృతదేహాలను రాత్రిపూట స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మిలిటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ గాజాలో ఇంకా మిగిలి ఉన్న బందీలను వెనక్కి తీసుకురావాలని ఇజ్రాయెల్ నిర్ణయించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Yakshini: సోషియో ఫాంటసీ ‘యక్షిణి’.. వణికిస్తున్న ట్రైలర్!

అక్టోబర్ 7న హమాస్ దాడి చేసి దాదాపు 250 మంది ఇజ్రాయెలీయులు, విదేశీయులను బందీలుగా తీసుకుపోయింది. అనంతరం ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ లక్ష్యంగా దాడులు చేసింది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా హమాస్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే నవంబర్‌లో 130 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. మిగతా వారి సంగతి మాత్రం ఇంకా తెలియలేదు. వారు క్షేమంగా ఉన్నారా? లేదంటే చనిపోయారా? అన్న సంగతి మాత్రం తెలియలేదు. మరోవైపు యుద్ధానికి ముగింపు కోసం చర్చలు నడుస్తున్నా.. సఫలీకృతం కావడం లేదు.

ఇది కూడా చదవండి: CS Shantha Kumari: రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

Exit mobile version