NTV Telugu Site icon

Hamas Israel Conflict: నలుగురు బందీల కోసం జరిగిన ఆపరేషన్‌లో 274 మంది మృతి..!

Isral

Isral

Hamas Israel Conflict: సెంట్రల్‌ గాజాలో శనివారం ఇజ్రాయేల్ నలుగురు బందీల విడుదల కోసం చేపట్టిన ఆపరేషన్‌లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మరణించగా.. దాదాపు 700 మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు భారీగా ఉన్నారని ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. తొలుత ఈ ఆపరేషన్‌లో 100 మంది మరణించినట్లు ఇజ్రాయేల్ తెలపగా.. అయితే, ఈ సంఖ్య ప్రస్తుతం 274కు చేరుకుంది. బాధితుల ఆర్తనాధాలతో అల్‌-అఖ్సా ఆస్పత్రి ఫుల్ అయిందని ఓ స్వచ్ఛంద సంస్థ చెప్పుకొచ్చింది. ఆదివారం సెంట్రల్‌ గాజాలోని నుసీరాత్‌ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్‌ దగ్గర ఉన్న నలుగురు బందీలను ఇజ్రాయల్‌ ప్రత్యేక దళాలు రక్షించాయి.

Read Also: Boat Airdopes : ఒక్కసారి చార్జ్ చేస్తే 100గంటలు వినొచ్చు.. రూ.999కే హై క్వాలిటీ ఇయర్ బడ్స్

అయితే, ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకోవడంపై అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బందీలను రక్షించే టైంలో బలగాలపై భారీ ఎత్తున దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ వెల్లడించారు.. ఆ ఆపరేషన్‌లో ఓ అధికారి మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఇక, నుసీరాత్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్‌లలో బందీలను ఉంచినట్లు సమాచారం వచ్చింది.. రెండు బిల్డింగుల్లోకి మా బలగాలు ఒకేసారి ప్రవేశించడంతో.. వారిపై పెద్ద ఎత్తున దాడులు చేశారు.. దీంతో బలగాలను, బందీలను రక్షించేందుకు ప్రతి చర్యలు తీసుకున్నామని ఇజ్రాయేల్ వెల్లడించింది.

Read Also: Amaravati: అమరావతికి పూర్వ వైభవం..సంతోషంలో రైతులు

ఇక, గత ఏడాది అక్టోబర్లో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఆకస్మాత్ గా దాడి చేసి.. దాదాపు 250 మందిని కిడ్నాప్‌ చేసి గాజాకు తీసుకుపోయాయి. దీంతో, నవంబరులో ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ టైంలో కొంత మందిని వదిలిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్‌ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్‌ చెప్పు్కొస్తుంది. వారిని గాజాలోని జనసమ్మర్థ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు తెలుస్తుంది.