Israel – Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు శనివారం నాటి దాడులతో పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై భారీ దాడులు ప్రారంభించాయి. టెహ్రాన్ నగరమంతటా దట్టమైన పొగ కమ్ముకుంది. ఇరాన్‌లోని ఉత్తర నగరమైన తబ్రిజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. దీంతో 36 మంది విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర భీకర దాడులు బీభత్సం సృష్టిస్తున్నాయి.. దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్…
దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయాడంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు. తమ సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారన్న ఇరాన్ ఆర్థికమంత్రి. ఇరాన్ అధ్యక్షుడితోపాటు ఉన్నతాధికారులంతా సురక్షితమని ప్రకటన.
మధ్య ఆసియా పరిస్థితిపై భారత విదేశాంగశాఖ స్పందన. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరిన భారత్. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలి. -భారత విదేశాంగశాఖ
ఇరానియన్లకు ఇంతకు మించిన ఛాన్స్ మరొకటి రాదు. ఇప్పుడే, అర్జంటుగా మీ పాలకులను మార్చుకోండి.! -ఇరానియన్లకు ట్రంప్ సందేశం
ఎయిర్‌లైన్స్‌కు DGCA కీలక ఆదేశాలు. మధ్య ఆసియా దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేయాలని ఆదేశం. ఇప్పటికే మధ్య ఆసియా దేశాలకు సర్వీసులు నిలిపివేసిన పలు ఎయిర్‌లైన్స్.
ఇరాన్ దాడుల్లో కువైట్ ఎయిర్‌బేస్ ధ్వంసం.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి. అజీజ్ నాసీర్‌జాదే మృతి చెందాడని రాయిటర్స్ కథనం. ఇప్పటికే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి.
ఇజ్రాయెల్, అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్. ఖతార్, UAE, సౌదీ, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులు. ఎయిర్, నేవల్ బేస్‌లపై మిస్సైల్స్‌లో దాడులు. సౌదీ అరేబియాలో 2 వేల మంది వరకు అమెరికా సైనికులు. ఇరాన్ దుందుడుకు చర్యలు తప్పుబట్టిన ఇరాన్. అబుదాబిలో మిస్సైల్ పడినచోట ఒక ఆసియా వ్యక్తి దుర్మరణం.
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులతో మూతబడ్డ పశ్చిమాసియా ఎయిర్‌స్పేస్. ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతర్‌లో ఎయిర్‌స్పేస్ మూసివేత. దుబాయ్ నుంచి అన్ని విమాన సర్వీసులను నిలిపివేసిన ఎమిరేట్స్. దుబాయ్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎమిరేట్స్ విమాన సర్వీసులు రద్దు.
గల్ఫ్ యుద్ధంతో మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. ఇవాళ ఒక్క రోజే కిలోపై రూ.25 వేలు పెరిగిన వెండి. 3 లక్షల మార్కు దాటి మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,20,000. ఇవాళ ఒక్కరోజే రూ.4వేలు పెరిగిన తులం బంగారం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,710. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,650.
ఇరాన్: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 50 మందికిపైగా స్కూల్ విద్యార్థులు మృతి.
దుబాయి: బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు.
ఇరాన్ అధినేత ఖమేనీ నివాసాలపైనా దాడులు. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ నివాసాలపైనా దాడులు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ వైమానిక దాడులు. ఇరాన్ దాడిలో టెల్ అవివ్‌లో 28 బస్సులు దగ్ధం.
కువైట్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు. అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి. స్థానిక భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలి. కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను ఫాలో అవ్వాలని సూచన. ఇండియన్ ఎంబసీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం.
పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఉన్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ అడ్వైజరీ ప్రకారం భారతీయులు అనవసర ప్రయాణాలను నివారించాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ యూఏఈ అధికారులు, రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.
అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ యధావిధిగా పనిచేస్తున్నాయని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని స్పష్టం చేసింది. ఏదైనా అత్యవసర విచారణ లేదా సహాయం కోసం భారతీయ పౌరులు టోల్ ఫ్రీ నంబర్ 800-46342 లేదా వాట్సాప్ నంబర్ +971543090571 ద్వారా సంప్రదించవచ్చని, అలాగే pbsk.dubai@mea.gov.in, ca.abudhabi@mea.gov.in ఈమెయిల్ అడ్రస్‌లను కూడా వాడుకోవచ్చని సూచించింది.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి. ఇరాన్-ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా అంతటా మూతబడిన వైమానిక ప్రదేశాలు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో రగులుతున్న పశ్చిమాసియా.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు.. మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 36 మంది విద్యార్థులు మృతి..
ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులు.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ దాడి.. ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ పై విరుచుకుపడిన ఇరాన్.. 35కి పైగా మిస్సైళ్లను ప్రయోగించిన ఇరాన్..
అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ఇరాన్.. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేం ముగింపు పలుకుతాం.. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుంది: ఇరాన్
ఇరాన్ మీద దాడులపై డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించాడు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుంది.. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు దాడులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు: ట్రంప్
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరదాడులు.. మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్స్.. లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్.. వేలాది మంది సైనికులు మరణించారంటున్న ఇరాన్.. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో దాడులు.. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లక్ష్యంగా దాడులు.. ఇస్ఫహాన్ లో భారీ పేలుళ్లు.. ఇస్ఫహాన్ లోనే న్యూక్లియర్ తయారీ కేంద్రాలు.. ప్రతిదాడులకు సిద్ధమవుతున్న ఇరాన్..
చర్చలపై సంతృప్తిగా లేనని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే దాడులు.. నా మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదంటున్న ట్రంప్..
ఇరాన్ పై క్షిపణి దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించిన ఇజ్రాయెల్.. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై దాడులు చేసినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్.. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే దాడులని ప్రకటన.. ఎయిర్ స్పేస్ ని మూసివేసిన ఇజ్రాయెల్..
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ పై క్షిపణి దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ లోని టెహ్రాన్ లో భారీ పేలుళ్లు.. టెహ్రాన్ లో స్కూల్లు, కార్యాలయాలు మూసివేత..