NTV Telugu Site icon

Israel-Hamas War: గాజాలో భవనాల కింద మృతదేహాలు.. చేతులతో తవ్వుతున్న ప్రజలు

Israel Hamas War

Israel Hamas War

Gaza people are digging with their hands to find their relatives: ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో గాజాలోని పెద్ద పెద్ద భవనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో ఈ యుద్ధంలో మరణించిన వారి గురించి వారి బంధవులు ఇప్పుడు శిథిలాల కింద గాలిస్తున్నారు. భవనాల శిథిలాల కింద చాలా మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ యుద్ధ సమయంలో వందలాది మంది ప్రజలు ఒట్టి చేతులతో చెత్తను తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది.

Read Also: Vivek: పన్ను ఎగ్గొట్టడం.. ఇసుక అమ్ముకోవడం బాల్క సుమన్‌ కు బాగా తెలుసు

ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో మరణించిన పాలస్తీనా పౌరుల బంధువులు తమ వారిని వెతకడానికి శిధిలాలను స్వయంగా తొలగిస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మృతదేహాల కోసం వెతుకుతున్నారు. శిథిలాల కింద నుంచి చాలా మృతదేహాలు బాగా కుళ్లిపోయాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ఐదు వారాలకు పైగా కొనసాగుతోంది. గాజాలోని చాలా వీధులు ఇప్పుడు శ్మశానవాటికల్లా మారాయి. ప్రాణాలతో బయటపడిన వారి కోసం సరిగ్గా వెతకడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది లేదని అధికారులు తెలిపారు.

Read Also: Road Accident : బైకు తప్పించబోయి కాలువలో పడిన ట్యాక్సీ.. 7గురు మృతి, 4గురికి గాయాలు

ఇక, గాజా యుద్ధంలో పాలస్తీనా పౌరులే లక్ష్యంగా చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన వారు వేల సంఖ్యలో ఉన్నారు.. ఇంకా వారి జాడ తెలియలేదు అని చెప్పారు. అయితే, ఇజ్రాయెల్-హమాస్ దాడుదల్లో 11,200 మందికి పైగా మరణించారని, వారిలో మూడింట రెండొంతుల మంది మహిళలు, పిల్లలు మరణించారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,500 మంది పిల్లలతో సహా దాదాపు 2,700 మంది తప్పిపోయారని సమాచారం. మిగతా వారిని ఈ శిథిలాలలో ఖననం చేయబడి ఉంటారని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల కార్యాలయం అంచనా వేసింది.

Show comments