Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు 8 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. రెండు దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో వేలాది మంది మరణించగా, లక్షలాది మంది గాయపడ్డారు. హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌లో ఆయుధాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇజ్రాయెల్ మహిళలు కూడా శత్రువుల దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. అందరిలో తుపాకీకి డిమాండ్ ఉంది. ఇజ్రాయెల్ మహిళలు తుపాకులు ఉపయోగించడంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, హమాస్ దాడి తర్వాత 42,000 మంది ఇజ్రాయెల్ మహిళలు తుపాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 18వేలు మంజూరయ్యాయి. ఈ సంఖ్య గతంలో కంటే చాలా ఎక్కువ. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు మహిళలకు ఉన్న లైసెన్స్‌ల సంఖ్య కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.
Read Also:Fraud Case : లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు వాసులు చేసిన కార్పొరేటర్..
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ మహిళలు మరింత ఆందోళనకు గురయ్యారని చెబుతున్నారు. తనను తాను సురక్షితంగా భావించడం లేదు కాబట్టి రక్షించుకోవడానికి తుపాకీని కొనుగోలు చేస్తోందని.. భద్రతా మంత్రిత్వ శాఖ డేటా పేర్కొ్ంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 15,000 మంది మహిళలు తుపాకీలను కలిగి ఉన్నారు. 10 వేల మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో దాదాపు 1200 మంది చనిపోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలు కూడా బందీలుగా ఉన్నారు. దీని తర్వాత ఇజ్రాయెల్ కూడా హమాస్‌పై ప్రతీకారం తీర్చుకుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్ నిర్వహించింది. హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటివరకు, ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో 37,000 మందికి పైగా మరణించారు, గాయపడిన వారి సంఖ్య చాలా ఎక్కువ. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
Read Also:Devara : దేవర కోసం రంగంలోకి దిగిన ఆ స్టార్ కొరియోగ్రాఫర్..