Site icon NTV Telugu

Israel Attack On Gaza: గాజాపై ఇజ్రాయెల్ కాల్పులు.. 178 మంది మృతి

Israel Attack On Gaza

Israel Attack On Gaza

ఇజ్రాయెల్- హమాస్ మధ్య గత కొంత కాలంగా యుద్ధం కొనసాగుతుంది. అయితే, అక్టోబర్ 24న ఈ రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో వారం రోజుల పాటు ఎలాంటి దాడులు జరగలేదు. ఫస్ట్ నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత బందీల విడుదల కోసం ఈ సమయాన్ని మరి కొన్ని రోజులు పెంచారు. దీంతో ఇరువైపుల నుంచి దాడుల కొనసాగలేదు.. అయితే, ఈ ఒప్పందం నిన్నటితో (శుక్రవారం) ముగిసింది. ఇక, హమాస్‌ తొలుత కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ వైమానిక దాడులకు దిగింది. దీంతో బందీల రిలీజ్ చేయడం ఆగిపోయింది.

Read Also: Telangana Elections: ఓటు వెయ్యడానికి ₹ 2.5 లక్షలు.. తీరా చూస్తే లిస్ట్ లో పేరు లేదు..

ఇక, కాల్పులు మళ్లీ కొనసాగడంపై అమెరికాతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా రియాక్ట్ అయింది. గాజాలో దాడులను వెంటనే ఆపాలని, మళ్లీ కాల్పుల విరమణను పునరుద్ధరించాలని యూఎన్‌ చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌, వైట్‌హౌస్‌ కోరాయి. మనవతాకోణంలో సహాయం చేసేందుకు ఇజ్రాయెల్‌, ఈజిప్ట్‌, ఖతార్‌ దేశాలతో కలిసి పని చేస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్‌ అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు.

Read Also: World Old Tortoise : ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన తాబేలు.. ఇప్పుడు వయసేంతో తెలుసా?

అయితే, హమాస్‌ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ సైనికులు చెప్పారు. ఇంకా హమాస్‌ బందీల్లో 200 మంది ఉన్నారు.. వారిలో 17 మంది మహిళలతో పాటు చిన్నారులు ఉన్నట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డానియెల్‌ హగారీ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ తమ అధీనంలో ఉన్న 100 మంది బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్‌ తమ దేశంలోని జైళ్లలో ఉన్న 240 మంది ఖైదీలను రిలీజ్ చేసింది. అక్టోబర్‌ 7న హామాస్‌ ఇజ్రాయెల్‌పై దాడికి దిగి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్‌ ప్రజలు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్‌ గాజాలో వైమానిక దాడులకు దిగడంతో సుమారు 15,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు.

Exit mobile version