Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ispl T10 2024 Sachin Tendulkar Hits Huge Six In Hero Akshay Kumar Bowling

Sachin Tendulkar: బౌలింగ్‌ వేసిన హీరో అక్షయ్‌ కుమార్‌.. భారీ సిక్సర్‌ బాదిన సచిన్‌ టెండూల్కర్‌!

Published Date :March 7, 2024 , 8:58 am
By Sampath Kumar
Sachin Tendulkar: బౌలింగ్‌ వేసిన హీరో అక్షయ్‌ కుమార్‌.. భారీ సిక్సర్‌ బాదిన సచిన్‌ టెండూల్కర్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sachin Tendulkar Smashes Six in Akshay Kumar Bowling: ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐఎస్‌పీఎల్‌) బుధవారం ఆరంభం అయింది. లోకల్‌ టాలెంట్‌ను వెలికితీయడమే ఐఎస్‌పీఎల్‌ లక్ష్యం. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ టీమ్స్ కొనుగోలు చేశారు. ఫాల్కన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కొనుగోలు చేశారు. ఐఎస్‌పీఎల్‌ ఆరంభ వేడుకల్లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. హీరోలు సూర్య, అక్షయ్‌ కుమార్‌, రామ్‌ చరణ్‌ సందడి చేశారు. చరణ్‌ వీరందరితో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేమస్ సాంగ్ ‘నాటు నాటు’కు స్టెప్పులేయించాడు.

ఆరంభ వేడుకల అనంతరం ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యంలోని టీమ్‌ మాస్టర్స్‌ ఎలెవెన్‌, అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలోని టీమ్‌ ఖిలాడీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అమిర్‌ హుసేన్‌ అనే దివ్యాంగ క్రికెటర్‌తో కలిసి సచిన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ తొలి ఓవర్‌ వేయగా.. మూడో బంతికి సచిన్‌ భారీ సిక్సర్‌ బాదాడు. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన సచిన్.. హిందీ బిగ్‌ బాస్‌ విన్నర్‌ మునావర్‌ ఫారుఖీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Also Read: Women’s Day 2024: ఉమెన్స్ డే స్పెషల్.. గిఫ్టింగ్ స్టోర్‌ను ప్రారంభించిన అమెజాన్!

ఎగ్జిబిషన్ మ్యాచ్ అనంతరం ఐఎస్‌పీఎల్‌ తొలి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమితాబ్‌ జట్టు మఝీ ముంబై, అక్షయ్‌ కుమార్‌ టీమ్ శ్రీనగర్‌ వీర్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 10 ఓవర్లలో 7 వికెట్లను 140 రన్స్ చేసింది. యోగేష్ పెంకర్ (61) హాఫ్ సెంచరీ చేశాడు. ఛేదనలో శ్రీనగర్‌ టీమ్ 7 వికెట్లకు 107 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. లోకేష్ (27) టాప్ స్కోరర్.

Mr. Khiladi getting told who the 𝗥𝗘𝗔𝗟 𝗞𝗵𝗶𝗹𝗮𝗱𝗶 of Cricket is 🤩🏏#SonySportsNetwork #ispl #isplt10 #Street2Stadium #ZindagiBadalLo #SachinTendulkar | @ispl_t10 pic.twitter.com/Qz3VttzYvY

— Sony Sports Network (@SonySportsNetwk) March 6, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Kumar
  • Akshay Kumar Bowling
  • ISPL
  • ISPL 2024
  • ISPL T10 2024

తాజావార్తలు

  • మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!

  • Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో కీలక చర్చలు..

  • Successful Lady Producers : నిర్మాతలుగా సక్సెస్ అందుకున్న అక్కాచెల్లెళ్లు

  • NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!

  • Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions