NTV Telugu Site icon

Ishan Kishan: ఏంటి బ్రో.. పాకిస్థాన్ కెప్టెన్‌ను అంత మాట అన్నావ్!

Isan

Isan

Ishan Kishan: నేడు ఐపీఎల్‌ 18వ సీజన్‌లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇది ఇలా ఉండగా టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్, మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి మధ్య జరిగిన సంభాషణ సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను అనిల్ చౌదరి షేర్ చేశారు. అందులో ఆయనతో ఇషాన్ కిషన్ జరిపిన సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం పాకిస్థాన్ వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ పై ఇషాన్ కిషన్ చేసిన విమర్శలు.

Read Also: Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..

వైరల్ గా మారిన వీడియోలో అంపైర్ అనిల్ చౌదరి ఇషాన్ కిషన్‌ను ప్రశంశించారు. ప్రస్తుతం ఇషాన్ ఓ పరిణతి చెందిన ఆటగాడిగా మారాడని చెబుతూనే.. గతంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పు సమయంలో చాలాసార్లు అప్పీల్ చేసేవాడని, కాకపోతే ఇప్పుడు ఇషాన్ అలా చేయడం లేదంటూ తెలిపాడు. అయితే ఈ మార్పు ఎందుకు వచ్చిందని ఇషాన్ ను అనిల్ చౌదరి అడిగగా.. అందుకు సమాధానంగా ఇషాన్ ఊహించని సమాధానమిచ్చాడు.

Read Also: HPCL: లైఫ్ సెట్ చేసే జాబ్స్.. హిందూస్తాన్ పెట్రోలియంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ. 1.2 లక్షల జీతం

ఇషాన్ కిషన్ ప్రశ్నకు సమాధానంగా.. “ప్రస్తుతం అంపైర్లు చాలా తెలివైనవారని భావిస్తున్నట్లు తెలిపాడు. అలాగే, మనం ప్రతిసారీ అవుట్ అని అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్‌ అయినా సమయంలో కూడా అవుట్ ను నాటౌట్ ఇస్తాడు. కేవలం ఒకసారి అప్పీల్ చేయడం ద్వారా.. అదికూడా, సరైన సమయంలో అప్పీల్ చేయాలని తెలిపాడు. అలా సరైన సమయంలోనే అప్పీల్ చేయడంవల్ల మనపై అంపైర్లకు నమ్మకం ఉంటుందని తెలిపాడు. ఆ తర్వాత ఒకవేళ మహ్మద్ రిజ్వాన్ లాగా ఏదైనా చేస్తే, అంపైర్లు ఔట్ అయినా కానీ ఇవ్వరని అన్నాడు. దీనితో రిజ్వాన్ ప్రతీసారి అప్పీల్ చేస్తాడని కాస్త ఫన్నీగా చెప్పకనే చెప్పాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.