Suryakumar Yadav: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ మరోసారి దూకుడును ప్రదర్శించింది. రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత విజయం వెనుక ప్రధాన కారణం ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే చతికిలపడింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పరిస్థితి కాస్త కష్టంగా మారింది. కానీ ఇషాన్ కిషన్ ఏ మాత్రం భయపడలేదు. పవర్‌ప్లేలోనే చితక బాదాడు. 6/2 నుంచి పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 60కి పైగా వెళ్లింది.
READ MORE: Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి మరో బిగ్ ట్రీట్..
కాగా.. ఈ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్‌పై తనకు కోపం వచ్చిందని వెల్లడించాడు. “ఇషాన్ మధ్యాహ్నం లంచ్‌లో ఏమి తిన్నాడో తెలియదు. కానీ ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత అలా బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. అదే మన బ్యాట్స్‌మన్‌ల నుంచి కావాల్సింది. నాకు ఇషాన్ కిషన్‌పై నాకు కోపం వచ్చింది. పవర్‌ప్లేలో నాకు స్ట్రైక్ ఇవ్వకపోవడంతో కాస్త కోప్పడ్డాను.” అంటూ సరదాగా చెప్పాడు. మరోవైపు ఓటమి తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. భారత బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉందని అంగీకరించాడు. “ఇలాంటి జట్టుతో ఆడితే 300 పరుగులు కూడా సరిపోకపోవచ్చు. భారత్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడింది. మాకు ఇది మంచి పాఠం. వరల్డ్ కప్‌కు ముందు ఇలాంటి మ్యాచ్‌లు టీమ్‌ను సిద్ధం చేస్తాయి” అని చెప్పాడు.
