Ishan Kishan: బ్యాటింగ్‌లో విధ్వంసం, కీపింగ్‌లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, మైదానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేసిన ఒక చిన్న పొరపాటు, దాని చుట్టూ జరిగిన హైడ్రామా నెటిజన్లు, అభిమానులకు విపరీతంగా వినోదాన్ని పంచింది.
బ్యాటింగ్‌లో ‘పాకెట్ డైనమైట్’గా అదరగొడుతూ 81 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్, వికెట్ల వెనుక మాత్రం ఒక సరదా తప్పిదంతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్ ఐదో బంతికి జింబాబ్వే బ్యాటర్ తాడివనాషే మరుమని సింగిల్ తీసి, రెండో రన్ వద్దని తోటి బ్యాటర్ న్యూమాన్ న్యామ్హురికి సైగ చేశాడు. కానీ అప్పటికే న్యామ్హురి నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకోవడంతో.. ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు ఉండిపోయారు. ఆ సమయంలో జింబాబ్వే బ్యాటర్‌ను రనౌట్ చేయడం అత్యంత సులువైన పనిగా అనిపించింది. కేవలం వికెట్లకు బాల్ తగిలిస్తే అయిపోయేది.. కానీ ఆ క్షణంలో ఇషాన్ కిషన్ ఎంఎస్ ధోనీ శైలిలో మెరుపు వేగంతో అండర్ ఆర్మ్ త్రో విసిరి స్టంప్స్‌ను పడగొట్టాలని చూశాడు. దురదృష్టవశాత్తు ఆ త్రో మిస్సై బంతి పక్కకు దూసుకెళ్లడంతో, రనౌట్ అవ్వాల్సిన బ్యాటర్లు కాస్త తేరుకుని ఒక పరుగు పూర్తి చేసుకున్నారు. ఎంఎస్ ధోనీని ఇమిటేట్ చేయబోయి ఇషాన్ ఘోరంగా విఫలమయ్యాడని వ్యాఖ్యాతలు నవ్వుకోగా, ఆ క్షణం మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్‌నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
- NEET Controversy: "రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి".. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
- CM Chandrababu: మళ్లీ కూటమికి అధికారం ఖాయం.. కానీ..!
తాజావార్తలు
-
Ishan Kishan: బ్యాటింగ్‌లో విధ్వంసం, కీపింగ్‌లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
-
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
MG Comet EV: ఎంజీ కామెట్ EV కొనాలనుకుంటున్నారా? ధరలు పెంచిన కంపెనీ.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?
-
El Niño Impact: కొబ్బరిబొండాల పైనా ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
ట్రెండింగ్
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..