Site icon NTV Telugu

Bhavatharini : ఇలియరాజా ఇంట విషాదం.. ఆయన కుమార్తె మృతి..

Bhavatharini

Bhavatharini

సంగీత స్వరకర్త ఇళయరాజా కుమార్తె భవథరణి (47) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే.. ఆమె ఇటీవల వైద్యం కోసం శ్రీలంకకు వెళ్లారు. 5 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం 5:20 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె తమిళంలో గాయనిగా అరంగేట్రం చేసింది. ఆమె తన సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీతంలో కూడా చాలా పాటలు పాడారు. ముఖ్యంగా, భారతి చిత్రంలో మయిల్ పోలా పొన్ను ఒన్ను పాట పాడినందుకు ఆమె జాతీయ అవార్డును గెలుచుకుంది. భవథరణి మృతదేహాన్ని రేపు భారత్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.

 

Exit mobile version