Site icon NTV Telugu

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కెరీర్‌కు ముప్పు?

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో వయసుతో సంబంధం లేకుండా ప్లేయర్లు వస్తున్నారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 2025లో వైభవ్ సంచలనం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) ఆడిన తీరును ఎవరూ మర్చిపోలేరు. దూకుడైన ఆట తీరుతో ఎక్కడైనా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సింగిల్స్‌ తీసినంతా ఈజీగా వైభవ్ సిక్సర్లు బాదేస్తున్నాడు. ఐతే యువ బ్యాటర్ వైభవ్ కెరీర్‌కు బీసీసీఐ తీసుకుంటున్న ఒక నిర్ణయం వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

Also Read: Pakistan Record: 25 ఏళ్ల తర్వాత.. పాకిస్థాన్ అరుదైన రికార్డు!

బీహార్ తరఫున రాబోయే రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆడేందుకు వైభవ్‌ సూర్యవంశీకి మంచి అవకాశం ఉంది. బీహార్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలెక్షన్ ప్యానెల్‌లో మూడు కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను బీసీసీఐ వెంటనే భర్తీ చేయకపోవడంతో.. రంజీ ట్రోఫీకి జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లే లేకుండా పోయారు. దీని కారణంగా వైభవ్ వంటి టాలెంటెడ్ కుర్రాడికి ఈ సీజన్‌లో ఆడే అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్లక్యం వహిస్తే.. అతడి కెరీర్‌కి ముప్పు వాటిల్లినట్లే.

Exit mobile version