Uorfi Javed Engagaed: తన అసాధారణ ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండే ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె వార్తల్లో ఉన్నది తన బట్టల విషయంలో కాదు. తన అభిమానులు ఈ వార్త వింటే అవాక్కవడం, ఆందోళన చెందడం ఖాయం.
Read Also:AP High Court: నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
రహస్యంగా ఉర్ఫీ జావేద్ నిశ్చితార్థం?
ఉర్ఫీ జావేద్ నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫోటోలలో ఉర్ఫీ సల్వార్ సూట్ ధరించి.. ఓ వ్యక్తితో పూజలో కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఫోటోలో ఆ వ్యక్తి ముఖం బ్లర్ చేయబడి ఉంది. ఉర్ఫీ అతనికి ఉంగరం ధరించేలా కనిపించింది.
Read Also:ICC Cricket World Cup: సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు దక్కని చోటు!
హిందూ ఆచారాల ప్రకారం నిశ్చితార్థం
ఈ ఫోటోలలో ఉర్ఫీ నల్లటి సూట్‌లో.. నుదుటిపై దుపట్టాతో ఉంది. ఈ నిశ్చితార్థం హిందూ ఆచారాల ప్రకారమే జరిగిందని ఈ వైరల్ చిత్రాలను బట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. ఈ ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. ఉర్ఫీ జావేద్‌కి సంబంధించిన ఈ ఫోటోలపై కామెంట్స్ వెల్లువెత్తాయి. పోస్ట్‌పై ప్రజలు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ ‘అతను హిందీ కుర్రాడిగా కనిపిస్తున్నాడు..’ అని కామెంట్‌లో రాశాడు. ఆ ఫోటోలను చూసిన ఉర్ఫి జావెద్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హిందూ ఆచారాల ప్రకారం నటి నిశ్చితార్థం చేసుకోవడంతో ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనిపై ఉర్ఫీ జావేద్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.