నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయి మంచి టాక్‍తో బిగ్గెస్ట్ వసూళ్లు సాధిస్తుంది.దీనితో చిత్ర యూనిట్ భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.. బ్లాక్‍బాస్టర్ దావత్ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‍లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు..భగవంత్ కేసరి సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగా ఏ టైటిల్ అనుకున్నారో దిల్ రాజు తెలియజేశారు.. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత దీని గురించి తనతో అనిల్ చాలాసార్లు చెప్పారని దిల్‍రాజు గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి ‘ఐ డోంట్ కేర్’ అని టైటిల్ అనుకున్నట్టు అనిల్ ముందుగా నాకు చెప్పాడని, టైటిల్ కొత్తగా ఉందని తానూ చెప్పానని అన్నారు. అయితే, ఆ తర్వాత బాలకృష్ణ క్యారెక్టర్‌కు తగ్గట్టు భగవంత్ కేసరి అని టైటిల్ మార్చారని దిల్‍రాజు తెలిపారు.. అయితే, ముందుగా అనుకున్న ‘ఐ డోంట్ కేర్’ టైటిల్ ను అనిల్ ట్యాగ్‍లైన్‍లా మార్చారు.
అనిల్ రావిపూడి కేవలం ఎంటర్‌టైన్ చేస్తాడని అనుకున్నామని, కానీ భగవంత్ కేసరి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడని దిల్‍రాజు చెప్పారు. “ఇప్పుడు అనిల్ రావిపూడి 2.O. ఇక నువ్వు కేవలం ఎంటర్‌టైన్‍మెంట్ కథలు రాస్తే కుదరదు” అని దిల్‍రాజు చెప్పారు.భగవంత్ కేసరి సినిమా ముందు వరకు శ్రీలీల అంటే కేవలం డ్యాన్స్ గుర్తుకు వచ్చేదని, కానీ ఈ చిత్రంలో ఆమె పర్ఫార్మెన్స్ చూశాక జయసుధ,శ్రీదేవి గుర్తుకొచ్చారని దిల్‍రాజ్ అన్నారు. శ్రీలీలకు చాలా మంచి భవిష్యత్తు ఉందని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె టాప్ పొజిషన్‍లో ఉంటుందని ఆయన చెప్పారు. తెలుగమ్మాయి ఇంత గొప్పగా చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.బాలకృష్ణ గారు తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన, క్లాసిక్స్ లాంటి సినిమాల్లో నటించారని దిల్ రాజు అన్నారు. ఇప్పుడు భగవంత్ కేసరి కూడా ఆ జాబితాలో చేరిందని ఆయన తెలిపారు. తెలంగాణ యాస నేర్చుకునేందుకు బాలకృష్ణ చాలా కృషి చేశారని దిల్ రాజు అన్నారు. ఆయనకు ఉన్న అంకిత భావం వల్ల భగవంత్ కేసరి సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని దిల్ రాజు తెలిపారు..