Pawan Kalyan : పవన్ – త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియా టాక్‌లో నిజమెంత?

Pawan Trivikram

Pawan Trivikram

ఆ మధ్య ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సినిమా ఏదైనా వస్తుందంటే.. అందులో త్రివిక్రమ్ హ్యాండ్ ఉండాల్సిందే. ఎందుకంటే.. ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది మరి. కానీ, ఇప్పుడది కనిపించడం లేదనే కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో! దానికి కారణం లేకపోలేదు. జల్సా సినిమా నుంచి మొదలైన పవన్, త్రివిక్రమ్ సాన్నిహిత్యం.. ఆ తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఙాతవాసి సినిమాలు చేసేలా చేశాయి. అయితే, ఎప్పుడైతే పవన్ పాలిటిక్స్‌తో బిజీ అయ్యారో.. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఆయన సినిమాలకు సంబంధించిన వ్యవహారలన్నీ దగ్గరుండి చూస్తు వచ్చాడు.

Also Read : PEDDI : చెన్నై సూపర్ కింగ్స్ తో ‘పెద్ది’ రచ్చ రచ్చే!

అలా వచ్చిన సినిమాలే భీమ్లా నాయక్, బ్రో. అయితే, బ్రో సినిమా వరకు పవన్ ప్ర‌తి సినిమాలోను ఇన్‌వాల్వ్‌ అయిన త్రివిక్రమ్.. ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటు వస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో ఆయన ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణం ఏంటా? అని ఆరా తీస్తే, త్రివిక్రమ్‌ కొత్త సినిమాలే అని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే.. పవన్ రాజకీయంగా బిజీగా ఉన్నప్పుడు, ఆయన సినిమాలకు సంబంధించిన పనులు మాత్రమే చేశాడు త్రివిక్రమ్. అందుకే 2020 నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా మాత్రమే చేశాడు. ఆ సినిమానే గుంటూరు కారం. అయితే, ఇక పై దర్శకుడిగా తన సినిమాల పై గట్టిగా ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాడు త్రివిక్రమ్. ఈ క్రమంలోనే పవన్ సినిమాల్లో ఇన్వాల్వ్ కావడం లేదట, అలాగే ఆయన సినిమా ఫంక్షన్‌లకు కూడా దూరంగా ఉంటున్నాడట. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం.. వెంకటేష్‌తో తీస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ పైనే ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇంతే తప్ప.. పవన్, త్రివిక్రమ్ మధ్య ఎలాంటి విభేధాలు లేవనేది ఇండస్ట్రీ టాక్.