NTV Telugu Site icon

Nivetha Pethuraj : పోలీసులతో నివేతా వాదన.. అస్సలు విషయం బయట పడిందిగా..

Nivetha

Nivetha

టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చెన్నై భామ అయిన నివేతా పేతురాజ్‌ ”మెంటల్‌ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన ఈ భామ గత రెండేళ్లుగా ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు.ఇదిలా ఉంటే ఈ భామకు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ వుతుంది.కారులో ప్రయాణిస్తోన్న నివేతను ఆపిన పోలీసులు తన కారు డిక్కీ ఓపెన్‌ చేయాలని కోరగా..అందుకు ఆమె నిరాకరిస్తుంది.రోడ్డు వరకే వెళ్తున్నాను. లోపల ఏమీ లేదు.నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చూపిస్తా. డిక్కీలో ఏం లేవు’ అని నివేతా తెలిపింది .

Read Also :Bhaje Vaayu Vegam : “భజే వాయు వేగం” మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్..

ఎంత చెప్పిన వినకుండా డిక్కీ తెరిచి చూపించని నివేతా పోలీసులతో వాగ్వాదానికి దిగింది.అదే సమయంలో ఈ ఘటనను వీడియో తీస్తున్న ఓ పోలీస్ ఫోన్‌ను కూడా ఆమె లాగేసుకుంటుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ డిక్కీలో ఏముందో అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇదంతా కూడా తన తరువాత సినిమా కోసం ప్రమోషన్ స్టంట్ అని తెలిసి అంత షాక్ అయ్యారు.ఈ భామ జీ 5 ఓటిటిలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పరువు”.ఈ సినిమా ప్రీమియర్స్ జూన్ 14 న ఉండనునున్నట్లు మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేసారు.పరువు ప్రమోషన్స్ కోసమే నివేత ఇలా ప్రవర్తించినట్లు మేకర్స్ రెవీల్ చేసారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Show comments