పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత గా నటిస్తున్న సినిమా ఆదిపురుష్… ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది.అందులో భాగంగా నే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేయగా యూవీ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ ఈ సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ను అయితే ఇచ్చారు. ఆదిపురుష్ లో రాముని పేరు రాఘవ్ కాగా సీత పేరు జానకి అని ఉంది. ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇలా పేర్లు పెట్టలేదని ఆయన అన్నారని తెలుస్తుంది.సినిమా లో రాముడి కి మీసాలు ఎందుకు అనే ప్రశ్నకు విక్రమ్ స్పందిస్తూ ఆదిపురుష్ మూవీ అందరికీ నచ్చుతుందని సినిమా చూస్తే రామునికి మీసాలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
అప్పట్లో అన్నమయ్య సినిమాలో నాగార్జున మీసాలతో కనిపించగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కూడా మీసాలతో కనిపించనున్నారని ఆయన చెప్పు కొచ్చారు.. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని అయితే వినియోగించారని విక్రమ్ వెల్లడించారు.మిగతా సన్నివేశాలు మరియు పాటలు మాత్రం సాధారణంగానే ఉంటాయని ఆయన అన్నారు. సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే యుద్ధ సన్నివేశాలు ఎంతో హైలెట్ అని ఆయన పేర్కొన్నారు. మార్వెల్ సినిమాలు అలాగే సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదిపురుష్ అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో లేదో మరీ చూడాలి. ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆదిపురుష్ మూవీ రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కూడా మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమాపై అంచనాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుంది ఫ్యాన్స్ నమ్ముతున్నారు.