Site icon NTV Telugu

Pushpa 2 : అబ్బా.. పుష్ప 2 రిలీజ్ డేట్ మళ్లీ మారింది ?

Pushpa 2 Climax

Pushpa 2 Climax

Pushpa 2 : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప పార్ట్-1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రాల్లో ఇదొకటి. ఇందులో అల్లు అర్జున్ నటనకు తెలుగు ప్రేక్షకులంతా బ్రహ్మరథం పట్టారు. మునుపెన్నడూ చూడని విధంగా కనిపించి తెగ ఆకట్టుకున్నాడు. ఇక ఈ క్రేజీ సినిమాలోని ఐటెం సాంగ్ తో పూనకాలు తెప్పించారు. ఎర్రచందనం, స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. శ్రీవల్లి పాత్రలో మరోసారి తన సత్తా చాటింది. అల్లు అర్జున్ ప్రేయసిగా జనాలను మెప్పించింది. స్టెప్పులతో ఆడించింది. అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనకు జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

Read Also:Viswam : సినిమా చూసేటప్పుడు మీకు నవ్వు ఆగదు: గోపిచంద్

మరి సెన్సేషనల్ హిట్ పుష్ప కి సీక్వెల్ గా వస్తున్న ఈ పుష్ప 2 సినిమాపై భారీ హైప్ నెలకొంది. అయితే ఎప్పుడో ఆగస్ట్ 15కే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇలా ఒక లాస్ట్ కు డిసెంబర్ 6కి ఫైనల్ అయ్యిన ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 6న తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది డిసెంబరు 6న కాకుండా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో దింపే ఛాన్స్ ఉన్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే పుష్ప 2 ప్రీపోన్ అయ్యిందో లేదో అనే దానిపై అధికారికంగా క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also:Honda vs Hero: హీరో మోటోకార్ప్‌కు షాకిచ్చిన హోండా!

Exit mobile version