Prabhas : సుభాష్ చంద్రబోస్ పాత్రలో ప్రభాస్.. హను ప్లాన్ మామూలుగా లేదుగా ?
- హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్
- సినిమా పేరు ఫౌజీ అని ప్రచారం
- సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించనున్న డార్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : ప్రభాస్ ‘కల్కి 2898 AD’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1100 కోట్ల బిజినెస్ చేసింది. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఖాతాలో చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రభాస్ నటించబోవు నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్ డేట్ ఒకటి ఫ్యాన్స్ ను పండగ చేసుకునేలా చేస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. ‘కల్కి’ సినిమా తర్వాత ప్రభాస్ కొంత గ్యాప్ తీసుకుని మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’తో తిరిగి రాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలైంది. దీని భారీగా రెస్పా్న్స్ వస్తోంది. దీని తరువాత ఆయన ఓ పీరియాడిక్ డ్రామాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 సంవత్సరంలో వస్తుంది. దీని తర్వాత అతను సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ , ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ 2 చిత్రాల్లో చేయనున్నారు.
Read Also:Nagar Kurnool Crime: దారుణం.. భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసిన భర్త..
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఈ నాలుగు చిత్రాలే కాకుండా అతని ఖాతాలో కల్కి 2 కూడా ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ను ఆ సినిమా టీం ఎప్పుడో ప్రకటించింది. నాగ్ అశ్విన్ త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పనులను ప్రారంభించనున్నారు. మొదటి పార్ట్‌తో పాటు కొన్ని పార్ట్‌లు కూడా ఇప్పటికే షూట్ చేశారట. అయితే ఈసారి ఏ ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడో అని ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది కాకుండా ఆయన హను రాఘవపూడి తీయబోవు చిత్రం ‘ఫౌజీ’లో నటిస్తారంటూ వార్తలు వస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అనేక అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.
Read Also:Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
ప్రభాస్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ గత రెండు సినిమాలు అద్భుతంగా ఆడాయి. ‘కల్కి’ తర్వాత ఆయన ‘ది రాజా సాబ్’తో రానున్నారు. ఫౌజీ చిత్రం అపూర్వమైన చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో.. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన యుద్ద కథను చూపించబోతున్నారు. అంతేకాకుండా ఈ ఫౌజీ సినిమాలో ప్రేమకథ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని గతంలో చెప్పుకున్నారు. అయితే, ఇది సుభాష్ చంద్రబోస్ కాలాన్ని చూపుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తన ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!