టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. తెలుగు చిత్ర పరిశ్రమకు డైలాగ్ రైటర్ గా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత స్క్రీన్ ప్లే ను అందిస్తూ కొన్ని సినిమాలు చేసిన తర్వాత పటాస్ సినిమాతో మొదటి సారి డైరెక్టర్ గా మారాడు.పటాస్ సినిమా తో కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇవ్వగా తానేంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు అనిల్.మొదటి సినిమా సక్సెస్ కావడంతో వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి.అనిల్ రావిపూడి తీసిన అన్నీ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.వరుసగా అర డజను సినిమాలు తీసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ హీరో గా భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల ముఖ్య పాత్రలో నటిస్తుంది.
అనిల్ రావిపూడి మొత్తం తన కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు చేసిన కూడా స్టార్ హీరోల తో సినిమా చేసే ఛాన్స్ రాలేదు.అనిల్ రావిపూడి తన చిత్రాల్లో కామెడీ అదరగొడతాడు.ఆయన సినిమాల్లోని కామెడీ బాగా సెట్ అవుతుంది.అనిల్ తాను చేసిన ఆరు సినిమాలలో ఒక మహేష్ బాబు తప్ప ప్రెజెంట్ స్టార్ హీరోలు ఎవరితో కూడా సినిమా చేయలేదు.జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాం చరణ్ లాంటి హీరోలతో అనిల్ రావిపూడి ద సినిమా తీస్తే చూడాలని ఆ హీరోల అభిమానులు కోరుకుంటున్నారు. మరి అనిల్ కు అవకాశం వస్తుందో లేదో చూడాలి.ఇప్పుడు బాలయ్య తో చేసే భగవత్ కేసరి సినిమా కనుక భారి విజయం సాధిస్తే అనిల్ కు స్టార్ హీరోలతో సినిమా అవకాశం వస్తుంది. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని సమాచారం. ఇప్పటికే బాలయ్య బర్త్డే కానుకగా వచ్చిన టీజర్ అదరగొట్టింది. బాలయ్య చెప్పే డైలాగ్స్ సినిమా పై అంచనాలు భారీ గా పెరిగేలా చేసాయి.