Uttam Kumar Reddy : జనవరి మాసాంతానికి నీటిపారుదల శాఖలో పదోన్నతులు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే క్రమమంలో బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సులననుసరించి.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి బదిలీలు చేస్తామన్నారు. దశాబ్దాకాలంగా నీటిపారుదల శాఖ గాడి తప్పిందన్నారు మంత్రి ఉత్తమ్. ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం జరిగిందని, నీటిపారుదల శాఖా బడ్జెట్ లో 11000 వేల కోట్లు అప్పులకు, వడ్డీలకే సరిపోతుందన్నారు. సంవత్సర కాలంగా శాఖాను గాడిలో పెడుతున్నామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మానవ వనరులు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. సంవత్సరం వ్యవధిలో 700 ఏఈఈలు,1800 లష్కర్ ఉద్యగాల భర్తీ ఉంటుందన్నారు.
Chandrababu: మోడీ అంటే నమ్మకం, విశ్వాసం
అంతేకాకుండా..’మరో 1300 ఉద్యగాల నియామకాలకుగాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతులు. యావత్ భారతదేశంలోనే తెలంగాణా నీటిపారుదల శాఖకు ప్రత్యేక గుర్తింపు. ఆధునిక దేవాలయాలుగా పేరొందిన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్,శ్రీశైలం ప్రాజెక్ట్ లు నిర్మాణాలు ఇక్కడి ఇంజినీర్లు రూపొందించిందే. వారి వారసత్వంగా యువ ఇంజినీర్లు ఎదగాలి. విధినిర్వహణలో సిన్సియారీటి, నిబద్ధత,పారదర్శకత కనిపించాలి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణాలోను నీటిపారుదల శాఖా అత్యంత ప్రతిష్టాత్మకమైనది. దీని ప్రతిష్టను కాపాడేందుకు యువ ఇంజినీర్లు కృషి చేయాలి.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Sreemukhi: రామలక్షణులపై వ్యాఖ్యలు.. క్షమించమని యాంకర్ శ్రీముఖి వేడుకోలు