Laser Defence: ఇజ్రాయెల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం. ఇటీవల ఖతార్ రాజధాని దోహాలో హమాస్ అగ్రనాయకత్వం దాగి ఉన్న భవనంపై బాంబుల వర్షం కురిపించి.. ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యధిక దేశాలతో ఒకేసారి యుద్ధాలు చేసిన దేశంగా ఇజ్రాయెల్‌కు ప్రత్యేక రికార్డ్ ఉంది. అందుకే ఈ దేశం తక్కువ ఖర్చుతో శత్రువులకు పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగించే ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ ఆధునాతన సూపర్ పవర్‌ను ఆవిష్కరించినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ తన కొత్త లేజర్ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ “ఐరన్ బీమ్”ను విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దారిలోనే భారత్ వెళ్తుంది.. ఆ కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Minister Seethakka : బీఆర్ఎస్ అంటే అప్పులు.. కాంగ్రెస్ అంటే అభివృద్ధి
ఎందుకు ప్రత్యేకం..
“ఐరన్ బీమ్” ఈ సాంకేతికత ప్రత్యేకమైనది ఎందుకంటే.. సాంప్రదాయ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని ప్రయోగించడానికి దాదాపు $50,000 (సుమారు ₹4 మిలియన్లు) ఖర్చవుతుంది. అయితే లేజర్‌తో లక్ష్యాన్ని చేధించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇప్పుడు ఇజ్రాయెల్ శత్రుదేశాలు ప్రయోగించే రాకెట్లు, డ్రోన్‌లను చాలా చీప్‌గా కచ్చితత్వంతో అడ్డగించగలదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భారతదేశం కూడా ఇజ్రాయెల్ దిశలో నడుస్తుంది. ఇప్పటికే ఇండియా ఈ సాంకేతికతపై పని చేస్తుడటంతో పాటు, ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది.
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ గతంలో గాజా నుంచి హమాస్, లెబనాన్ నుంచి హిజ్బుల్లా, యెమెన్ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన వేలాది క్షిపణులను నాశనం చేశాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అమీర్ బరామ్ మాట్లాడుతూ.. “ఒక హై-పవర్ లేజర్ వ్యవస్థ పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని సాధించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి” అని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఎల్బిట్ సిస్టమ్స్, రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రాఫెల్ ఛైర్మన్ యువల్ స్టెయినిట్జ్ దీనిని ఆధునిక యుద్ధానికి “గేమ్-ఛేంజర్” అని అభివర్ణించారు. ఎల్బిట్ సీఈఓ బెజలెల్ మాచ్లిస్ మాట్లాడుతూ.. కంపెనీ భవిష్యత్తులో ఎయిర్‌బోర్న్ లేజర్ టెక్నాలజీపై కూడా పనిచేస్తోందని, ఇది వాయు రక్షణ సామర్థ్యాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని చెప్పారు.
ఇలాంటి సాంకేతికత ఇండియా దగ్గర..
ఇజ్రాయెల్ తాజా సంచలన ఆయుధానాన్ని పోలింది భారతదేశ రక్షణ వ్యవస్థలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, క్షిపణులు వంటి వాయు లక్ష్యాలను 5 కిలోమీటర్ల దూరం వరకు నాశనం చేయగల 30 కిలోవాట్ల లేజర్ ఆయుధాన్ని DRDO అభివృద్ధి చేసింది. ఈ ఆయుధంతో శత్రు దేశాల సమాచార మార్పిడి, ఉపగ్రహ సంకేతాలను జామ్ చేయవచ్చు. దీనిని భూమి, నౌకలపై ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడానికి భారతదేశం కృషి చేస్తోంది.