Ireland vs South Africa: ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ విజయం సాధించింది. టీ20 ఇంటర్నేషనల్‌లో ఐర్లాండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో 2 మ్యాచ్ ల టీ20 సిరీస్ సమంగా 1-1తో ముగిసింది. తొలి టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడింది. ఈ విజయంలో ఐర్లాండ్ తరఫున ఇద్దరు సోదరుల పాత్ర కీలకమైంది. రగ్బీ ఆడి క్రికెట్ కు వచ్చిన అన్నయ్య రోస్ అడైర్ సెంచరీ సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా పతనాన్ని బంతితో విధ్వంసం సృష్టించే పనిలో పడ్డాడు తమ్ముడు మార్క్ అడైర్.
England vs Australia: ఇంగ్లాండ్ కొంప ముంచిన వరణుడు.. సిరీస్ ఆస్ట్రేలియా కైవసం!
సిరీస్‌లోని రెండో, చివరి టీ20లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు పంపింది. ఈ అవకాశాన్ని ఐర్లాండ్ రెండు చేతులా చేజిక్కించుకుంది. రాస్ అడైర్, పాల్ స్టిర్లింగ్ ఓపెనింగ్ వికెట్‌కు 137 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంలో 52 పరుగుల వద్ద స్టెర్లింగ్ ఔటయ్యాడు. పాల్ స్టిర్లింగ్ ఔట్ అయినప్పటికీ రాస్ అడైర్ షాట్లను స్వేచ్ఛగా ఆడాడు. 30 ఏళ్ల రాస్ అడైర్ రగ్బీతో తన క్రీడా జీవితాన్ని ప్రారంభించాడు. అంతకుముందు రగ్బీ ఆడేవాడు. కానీ, అతను కొన్ని గాయాలకు గురయ్యాడు. దీంతో అతను ఆ క్రీడను వదిలి క్రికెట్ వైపు మొగ్గు చూపవలసి వచ్చింది. ఇక మ్యాచ్ లో రాస్ అడైర్ తన దూకుడు బ్యాటింగ్‌ను ప్రదర్శించి దక్షిణాఫ్రికాపై సెంచరీ చేశాడు. 172.41 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతను 58 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. రాస్ అడైర్ టి20 కెరీర్‌లో ఇది మొదటి సెంచరీ. దీని ఆధారంగా ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది.
Chiranjeevi : దటీజ్ చిరు.. ఆయనకు అభిమానులంటే ఎంత గౌరవమో తెలుసా ?
ఇక దక్షిణాఫ్రికా 196 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు రాగా.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. దింతో రెండో టీ20 మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా పడిన 9 వికెట్లలో 4 మార్క్ అడైర్ సాధించి వారి పతనానికి కారణమయ్యాడు.