Site icon NTV Telugu

Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

Arunachala Moksha Yatra

Arunachala Moksha Yatra

Arunachala Moksha Yatra: తమిళనాడు పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలనుకునే భక్తులకు శుభవార్త. భారత రైల్వే టూరిజం, IRCTC కలిసి అరుణాచల మోక్ష యాత్ర (Arunachala Moksha Yatra) పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా తిరువణ్ణామలై, కాంచీపురం, పుదుచ్చేరిలోని ప్రముఖ ఆలయాలు, ప్రకృతి దృశ్యాలను దర్శించే అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈ యాత్ర సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..

Read Also: Today Gold Prices: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మరోమారు భారీగా తగ్గిన ధరలు..!

తమిళనాడులో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం దర్శనానికి కోరుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరిట అందించబడుతున్న ఈ ప్యాకేజీలో అరుణాచలేశ్వరుని దర్శించడమే కాకుండా.. కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం, పుదుచ్చేరిలోని ప్రకృతి దృశ్యాలు, అరబిందో ఆశ్రమం, అరోవిల్‌, బీచ్‌ వీక్షణం వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజుల పర్యటనగా ఉండబోతుంది. ప్రతి గురువారం కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ టూర్ సంబంధించి జూన్ 19 నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ యాత్ర కాచిగూడ నుంచి గురువారం సాయంత్రం 5:00 గంటలకు పుదుచ్చేరి వైపు (ట్రైన్ నం: 17653) రైలు ప్రయాణంతో ప్రారంభమవుతుంది. రెండో రోజు ఉదయం 11:05కి పుదుచ్చేరి చేరుకుంటారు. అక్కడ హోటల్‌ లో విశ్రాంతి అనంతరం అరబిందో ఆశ్రమం, అరోవిల్‌, బీచ్‌ చూడవచ్చు. మూడో రోజు తిరువణ్ణామలై చేరుకుని అరుణాచలేశ్వరుడి దర్శనం జరుగుతుంది. నాలుగో రోజు కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని, చెంగల్పట్టు నుంచి తిరుగు ప్రయాణం (ట్రైన్ నం: 17651) మొదలవుతుంది. ఐదో రోజు ఉదయం 7:50కి కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఈ ప్రయాణంతో యాత్ర ముగుస్తుంది.

Read Also: HBD Nandamuri Balakrishna: జై బాలయ్య.. పద్మభూషణ్ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!

ఇక ప్యాకేజ్ ఛార్జీలు కూడా వ్యక్తుల సంఖ్యను బట్టి భిన్నంగా ఉన్నాయి. కంఫర్ట్ క్లాస్ (3rd AC)లో డబుల్ షేరింగ్‌కు రూ. 20,060, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 15,610, పిల్లలకు (5-11 ఏళ్లు) విత్ బెడ్‌ కు రూ. 11,750, వితౌట్ బెడ్‌కు రూ. 9,950గా నిర్ణయించారు. అదే స్టాండర్డ్ క్లాస్ (స్లీపర్)లో డబుల్ షేరింగ్‌కు డబుల్ షేరింగ్ కు రూ.17,910, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,460, పిల్లలకు విత్ బెడ్ రూ.9,590, వితౌట్ బెడ్ రూ.7,800 గా నిర్ణయించారు.

ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం (3rd AC లేదా స్లీపర్ క్లాస్), రెండు రోజుల హోటల్ బస, ఉదయం టిఫిన్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఐఆర్‌సీటీసీ ద్వారా లభిస్తాయి. పర్యట ప్రాంతాల్లో ప్రవేశ రుసుములు భక్తులే భరించాలి. రద్దు చేసుకున్న పక్షంలో ఐఆర్‌సీటీసీ విధించిన క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. పూర్తి సమాచారం, బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR107 ఈ లింక్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.

Exit mobile version