NTV Telugu Site icon

Iran: ఈ సారి మా స్పందన తీవ్రస్థాయిలో ఉంటుంది..

Iran

Iran

తమ భూభాగంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటనపై ఇరాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చారు. డ్రోన్‌ దాడులను ఇజ్రాయెల్‌ ప్రతీకారంతో చేసినట్లు అయితే.. తాము కూడా అంతకుమించి ప్రతి దాడులు చేస్తామని వెల్లడించారు. శుక్రవారం నాడు జరిగిన డ్రోన్‌ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతంలోకి దూసుకెళ్లినవి డ్రోన్లు కాదు.. పిల్లలు ఆడుకునే బొమ్మలు అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: Wife Killed Husband: తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. మామతో కలిసి భర్తను చంపిన భార్య

ఇక, ఈ డ్రోన్ల దాడిని ఇజ్రాయెల్‌ చేసిన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై ఇరాన్‌ దర్యాప్తు కొనసాగిస్తుంది. డ్రోన్‌ దాడులకు సంబంధించి మీడియాలో వచ్చే కథనాల్లో క్లారిటీ లేదన్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ డ్రోన్‌ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే వెంటనే తాము కూడా ప్రతిదాడులను చేస్తామన్నారు. అలా కాకపోతే మేము ఇక్కడితో ముగిస్తామని హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ పేర్కొన్నారు. కాగా, నిన్న అమెరికా తయారీ ఎఫ్‌-14 టామ్‌క్యాట్స్‌ యుద్ధ విమానాలు ఉన్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతం దగ్గర దగ్గర నిన్న (శుక్రవారం) ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే, ఇస్ఫహాన్‌ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని ఇరాన్‌ ప్రకటించింది. ఇక, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసిందని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు.