NTV Telugu Site icon

Iran Iraq War: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడి.. నలుగురు సైనికులు మృతి, 60 మందికి పైగా గాయాలు

Iran Iraq War

Iran Iraq War

Iran Iraq War: లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై భారీ డ్రోన్ దాడి చేసింది. బిన్యామీనా సమీపంలోని సైనిక స్థావరంపై డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా, 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) ఈ మేరకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాట్లాడుతూ.. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ యుఎవితో ఆర్మీ బేస్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు ఐడీఎఫ్ జవాన్లు చనిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని., గాయపడినవారిని ట్రీట్మెంట్ జరుగుతునట్లు తెలిపారు.

Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్యకేసులో మూడో నిందితుడు అరెస్ట్.. మరో ముగ్గురు పరారీలో

ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుండి ప్రయోగించిన ఐదు డ్రోన్ లను గుర్తించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఎగువ గలిలీ, మిడిల్ గెలీలీ, వెస్ట్రన్ గెలీలీ, హైఫా బే, కార్మెల్‌తో సహా పలు ప్రాంతాల్లో సైరన్‌లు మోగాయి. అయినప్పటికీ, చాలా డ్రోన్‌ లను ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్న చివరికి ప్రాణ నష్టం జరగలేదు. అంతకుముందు ఆదివారం, దక్షిణ లెబనాన్‌ లోని ఇజ్రాయెల్ సైనికులపై పెద్ద ఎత్తున యాంటీ ట్యాంక్ క్షిపణులను కాల్చారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, పలువురు సైనికులు గాయపడ్డారని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

Crime: లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్ కోసం వృద్ధుడి హత్య..

Show comments