NTV Telugu Site icon

Iran: భద్రత అధికారి హత్య కేసు.. ఇద్దరు హిజాబ్‌ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష

Iran Protests

Iran Protests

Iran: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా అధికారిని చంపినందుకు ఇద్దరు వ్యక్తులను ఉరితీసింది. యువతి కస్టడీలో మరణించడంతో నిరసనలు చెలరేగడంతో పారామిలటరీ దళ సభ్యుడిని చంపినందుకు దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులను ఇరాన్ శనివారం ఉరితీసిందని న్యాయవ్యవస్థ తెలిపింది. దేశవ్యాప్త నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు ఉరితీయబడిన సంఖ్య కంటే తాజా హత్యలు రెట్టింపు అయ్యాయి. డిసెంబర్‌లో ఈ ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష విధించడం ప్రపంచ ఆగ్రహానికి కారణమైంది.

పారామిలటరీ దళ సభ్యుడైన రుహోల్లా అజామియన్‌ను హత్య చేసిన నేరంలో ప్రధాన నిందితులైన మహ్మద్ మహదీ కరామి, సయ్యద్ మొహమ్మద్ హొస్సేనీలను ఈ ఉదయం ఉరితీశారని వార్తా సంస్థ మిజాన్ ఆన్‌లైన్ నివేదించింది. డిసెంబర్ ప్రారంభంలో ఈ ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నవంబర్ 3న అజామియన్‌ను చంపినట్లు ఆరోపిస్తూ మంగళవారం సుప్రీంకోర్టు మరణశిక్షలను సమర్థించింది.

Russia-Ukraine War: మాట తప్పిన రష్యా.. కాల్పుల విరమణ ప్రకటనకు తూట్లు

హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో మహస అమిని అనే 22 ఏళ్ల యువతిని నైతిక విలువల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో ఆ తర్వాత ఆమె మృతి చెందడం దేశవ్యాప్త నిరసనలకు కారణమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రదర్శనలకు సంబంధించి 14 మందికి కోర్టులు మరణశిక్ష విధించాయి. వారిలో నలుగురికి ఉరిశిక్ష విధించబడింది, మరో ఇద్దరికి సుప్రీంకోర్టు వారి శిక్షలను నిర్ధారించింది. ఆరుగురు కొత్త విచారణల కోసం వేచి ఉన్నారు. మరో ఇద్దరు అప్పీలు చేసుకోవచ్చు.

Show comments