NTV Telugu Site icon

iQOO Z9s: అతి త్వరలో బడ్జెట్ ఫ్రెండ్లీ లో సరికొత్త మొబైల్ లాంచ్..

Iqoo Z9s

Iqoo Z9s

iQOO Z9s: iQOO Z9 సిరీస్ మంచి పాపులారిటీ తర్వాత ఇప్పుడు కంపెనీ భారతదేశంలో కొత్త iQOO Z9s సిరీస్‌ను ప్రారంభించబోతోంది. iQOO Z9S సిరీస్‌ను ఆగస్టులో భారతదేశంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ కింద రెండు 5G స్మార్ట్‌ ఫోన్‌ లను భారతీయ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఇకపోతే iQOO కంపెనీ కొత్త Z9S సిరీస్‌ను వచ్చే నెల ఆగస్టులో భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీ, పేర్లను బ్రాండ్ ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్‌కి సంబంధించిన ఇతర వివరాలు రాబోయే రోజుల్లో తెలవనున్నాయి. ప్రస్తుతానికి iQOO Z9s స్మార్ట్‌ఫోన్ తక్కువ బడ్జెట్‌లో మాత్రమే ప్రారంభించబడుతుందని అనుకోవచ్చు.

Sangameshwara temple: సంగమేశ్వరం గర్భాలయాన్ని తాకిన కృష్ణమ్మ.. చీర సారె సమర్పించి, మంగళ హారతి..

ఇకపోతే భారతదేశంలో iQOO Z9 Lite 5G ఫోన్ 4 GB RAM మోడల్ ధర రూ. 10,499 , 6 GB RAM మోడల్ ధర రూ. 11,499. రెండు వేరియంట్లు 128 GB స్టోరేజ్ ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ 6.56 అంగుళాల అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 840nits ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ iQoo మొబైల్ 2.4 GHz క్లాక్ స్పీడ్‌తో MediaTek Dimension 6300 octa-core ప్రాసెసర్‌ పై పనిచేసే Android 14 ఆధారిత Funtouch OS 14లో ప్రారంభించబడింది.

Chamari Athapaththu: టీ20 ఆసియా కప్‭లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌..

iQOO Z9 Lite 5G 6 GB పొడిగించిన RAMకి మద్దతు ఇస్తుంది. ఇది ఫోన్ ఫిజికల్ ర్యామ్‌కు వర్చువల్ ర్యామ్‌ను జత చేయవచ్చు. దాంతో 12 జిబి ర్యామ్ శక్తిని ఇస్తుంది. 1 TB మెమరీ కార్డ్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ AI కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకా లెన్స్ ఉన్నాయి. ఇక ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇక పవర్ బ్యాకప్ కోసం iQOO Z9 Lite 5G ఫోన్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ iQoo ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 5G SIM, బ్లూటూత్ వంటి అనేక వాటిని కలిగి ఉంది.