50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
- భారత్‌లో iQOO Buds ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ విడుదల..
- రూ.1,899 ధరతో మార్కెట్లోకి వచ్చిన కొత్త TWS..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Buds: భారత మార్కెట్లో తన ఆడియో ఉత్పత్తుల విభాగాన్ని ఐక్యూ (iQOO) మరింత పెంచుకునే విధానంలో భాగంగా.. iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త iQOO బడ్స్ ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ (TWS)ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే మెరుగైన సౌండ్, సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్, మొబైల్ గేమింగ్ కోసం అల్ట్రా-లో లేటెన్సీ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.
iQOO బడ్స్ లో 10mm హై-రిజల్యూషన్ మూవింగ్ కాయిల్ డ్రైవర్‌ను అందించారు. PU + PEEK డయాఫ్రాగమ్‌ను ఉపయోగించడం ద్వారా హార్మోనిక్ డిస్టార్షన్‌ను 2% కంటే తక్కువగా ఉంచేలా రూపొందించారు. “గోల్డెన్ ఇయర్స్ అకౌస్టిక్స్” టీమ్ సహకారంతో ఇయర్‌బడ్స్ సౌండ్‌ను ట్యూన్ చేశారు. ఇందులో DeepX 4.0 సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. మెగా బాస్, క్లియర్ వాయిస్, క్లియర్ హై పిచ్ తో పాటు ప్రత్యేకంగా ఆడియో బుక్ మోడ్ కూడా అందించారు.
Also Read
- రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
స్పేషియల్ ఆడియో మోడ్లు:
స్పేషియల్ ఆడియో కోసం నాలుగు ప్రీసెట్లు అందించారు. థియేటర్, కన్సర్ట్ హాల్, స్టూడియో, లైవ్ కన్సర్ట్ వంటి మోడ్‌లను ఎంచుకోవచ్చు. దీంతో మ్యూజిక్, సినిమాలు, ఇతర ఆడియో కంటెంట్‌ను మరింత ఇమర్సివ్‌గా వినే అవకాశం ఉంటుంది.
AI ఆధారిత ENC:
కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించేందుకు AI ఆధారిత డ్యూయల్-మైక్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందించారు. గాలి శబ్దం, ఆకస్మికంగా వచ్చే పరిసర శబ్దాలను తగ్గించేందుకు ప్రత్యేక క్రాస్-ఫ్లో డక్ట్, ఛాంబర్ నిర్మాణాన్ని కూడా ఉపయోగించారు. అలాగే ఇందులో Bluetooth 6.1 కనెక్టివిటీని అందించారు. డ్యూయల్ ఛానల్ ట్రాన్స్మిషన్ 2.0తో పాటు 10 మీటర్ల వరకు వైర్లెస్ కనెక్షన్ రేంజ్ ఉంటుంది. డ్యూయల్-డివైస్ కనెక్షన్‌కు కూడా సపోర్ట్ ఉంది. గూగుల్ ఫాస్ట్ పెయిర్, ఫైండ్ మై ఇయర్ ఫోన్స్, స్మార్ట్ టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. OriginOS, వివో, iQOO డివైస్‌లలో ఇయర్‌బడ్స్‌ను వెంటనే పెయిర్ చేసుకునే పాప్-అప్ ఫీచర్‌తో పాటు కస్టమ్ పెట్ యానిమేషన్స్, రిమోట్ కెమెరా షట్టర్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలో vEarphones యాప్ ద్వారా సెట్టింగ్స్, టచ్ కంట్రోల్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

లేటెన్సీ గేమింగ్:
మొబైల్ గేమర్లను దృష్టిలో పెట్టుకుని iQOO బడ్స్ లో కేవలం 42ms లో-లేటెన్సీని అందించారు. దీంతో గేమ్‌లో యాక్షన్, ఆడియో మధ్య ఆలస్యం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షూటింగ్, రేసింగ్ వంటి వేగవంతమైన గేమ్స్ ఆడే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
బ్యాటరీ బ్యాకప్:
బ్యాటరీ విషయంలో iQOO బడ్స్ ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తోంది. ఇయర్‌బడ్స్‌లో ఒక్కొక్కదానిలో 53mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌లో 525mAh బ్యాటరీ ఉండగా, కేస్‌తో కలిపి మొత్తం బ్యాటరీ బ్యాకప్ 50 గంటల వరకు లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 4 గంటల వరకు ప్లేబ్యాక్ పొందవచ్చు. డిజైన్ పరంగా iQOO బడ్స్ రౌండెడ్ ఛార్జింగ్ కేస్‌తో వస్తుంది. ఇయర్ టిప్స్‌ను వివిధ చెవుల ఆకృతులకు అనుగుణంగా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. ఇయర్‌బడ్స్‌కు IP54 రేటింగ్ ఉంది. దీంతో దుమ్ము, నీటి చినుకులు, స్వల్ప తేమ నుంచి రక్షణ లభిస్తుంది.
ధర:
iQOO Buds ను ఫ్లేమ్ ఎల్లో కలర్లో విడుదల చేశారు. భారతదేశంలో దీని ధర రూ.1,899గా నిర్ణయించారు. ఆగస్టు 24, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్లో భాగంగా అన్ని బ్యాంక్ కార్డులపై రూ.200 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!