Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలంలో ఫోన్లను నీటి నుంచి కాపాడుకోవడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. మీరు రూ.20,000 లోపు ధరలో డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ (IP రేటింగ్) కలిగిన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కోరుకుంటుంటే కొన్ని సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి వర్షపు నీటి నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా పెద్ద బ్యాటరీ, మెరుగైన కెమెరా, మంచి పెర్ఫార్మెన్స్ను అందిస్తాయి. రూ. 19,999 ధరకు లభించే వివో T5 లైట్ IP65 రేటింగ్‌తో వస్తుంది. ఇది ధూళి, నీటి చినుకుల నుండి రక్షణనిస్తూ, మిలిటరీ గ్రేడ్ బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో పాటు రోజంతా నిలిచేలా పెద్ద 6500mAh బ్యాటరీ ఇచ్చారు.
మోటోరోలా G37 పవర్ 5G మోడల్ రూ. 17,999 ధరకు అందుబాటులో ఉంది. ఇది IP64 రేటింగ్ , MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ మన్నికతో రూపుదిద్దుకుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో పాటు భారీ 7000mAh బ్యాటరీని అమర్చారు, ఇది బ్యాటరీ లైఫ్‌ను అత్యంత ముఖ్యంగా భావించేవారికి సరైన ఎంపిక. రియల్‌మి నార్జో 90x 5G ధర రూ. 17,499 గా ఉంది. ఈ ఫోన్లోని IP65 రేటింగ్‌తో పాటు ‘రైన్వాటర్ స్మార్ట్ టచ్’ ఫీచర్ వల్ల తడి చేతులతో కూడా స్క్రీన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో ఆటోఫోకస్, AI ఇమేజింగ్ సపోర్ట్ ఉన్న 50MP ప్రైమరీ కెమెరా మరియు 7000mAh బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
Also Read
- Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
- UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
- New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
- IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
రెడ్మి 15C 5G (Redmi 15 5G) ఫోన్ రూ. 19,940 ధరకు లభిస్తోంది. IP64 రేటింగ్‌తో నీటి చుక్కల నుంచి రక్షణనిచ్చే ఈ ఫోన్లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. ఫోటోల కోసం వెనుక వైపు 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. చివరగా.. రూ. 17,999 ధరకు లభించే ఒప్పో K14x 5G కూడా వర్షాకాలపు వినియోగానికి తగినట్లుగా డిజైన్ చేయబడింది. ఇందులో రోజువారీ నీటి స్ప్లాష్‌లను తట్టుకునే రక్షణ , 50MP ప్రైమరీ కెమెరా లభిస్తాయి. వర్షంలో కూడా ధైర్యంగా ఫోన్ వాడాలనుకునే వారికి ఈ మోడల్స్ అన్నీ బడ్జెట్లో లభించనున్నాయి.
తాజావార్తలు
-
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!