చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ ఫోన్‌ను.. డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేక ఏంటంటే.. క్యూ2 గేమింగ్ చిప్‌సెట్ కూడా ఉంటుంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఐకూ 13 అందుబాటులో ఉంటుంది.
ఐకూ 13 ఫోన్ 6.82 ఇంచెస్‌తో స్క్రీన్‌తో వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్‌లో 2కే రిజల్యూషన్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను అందించారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో (ఐకూ ఓరిజిన్ 5) పనిచేస్తుంది. ఇందులో క్యూ2 సూపర్ గేమింగ్ చిప్‌ను అందించారు.
Also Read: IPL 2025 Auction: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కష్టమే.. ఈసారి నిరాశ తప్పదు: ఆకాశ్
ఐకూ 13 ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 30 ఎంపీ కెమెరాను అందించారు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,150 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. దుమ్ము, నీరు చేరకుండా ఐపీ69 రేటింగ్ ఉంటుంది. చైనాలో ఐకూ 13 వైట్, గ్రీన్, బ్లాక్, గ్రే కలర్స్‌లో రిలీజ్ అయింది. భారత్‌లో వైట్ లెజెండ్ ఎడిషన్, గ్రే షేడ్స్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ధర రూ.52,999గా ఉండనుంది.