NTV Telugu Site icon

Shilpa Shetty: శిల్పాశెట్టి కంపెనీ ఐపీఓకు వస్తోంది.. పెట్టుబడి పెట్టి సంపాదించుకునేందుకు రెడియా?

Ipo Of Shilpa Shetty Mama Earth

Ipo Of Shilpa Shetty Mama Earth

Shilpa Shetty: మీ దగ్గర డబ్బులున్నాయా.. పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండి.. మంచి రాబడి కోసం ఎదరు చూస్తున్నారా.. మీకో మంచి అవకాశం.బాలీవుడ్ బ్యూటీ, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఆమె కంపెనీ మామా ఎర్త్ అండ్ ది డెర్మా .. మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ IPO మార్కెట్ నియంత్రణ సంస్థను SEBI ఆమోదించింది. త్వరలో ఈ కంపెనీ ఐపీఓ మార్కెట్‌లోకి రానుంది. ఈ ఏడాది మార్చిలోనే మామా ఎర్త్‌కు చెందిన హొనాస కన్స్యూమర్ ఐపీఓ తీసుకురావాలని ప్లాన్ చేశారు… అయితే మార్కెట్ పరిస్థితుల కారణంగా తీసుకురాలేదు.

మామా ఎర్త్‌కు చెందిన కంపెనీ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ ముసాయిదా పత్రాల ప్రకారం.. రూ. 400 కోట్ల విలువైన తాజా షేర్లు, ప్రస్తుత వాటాదారులకు 4,68,19,635 షేర్లు ఐపిఓ ద్వారా విక్రయించబడతాయి. కంపెనీ సహ వ్యవస్థాపకులు, ప్రమోటర్లు వరుణ్ అలగ్, గజల్ అలగ్, శిల్పా శెట్టి, రోహిత్ కుమార్ బన్సల్, సోఫినా వెంచర్స్, కునాల్ బహ్ల్. 2018 సంవత్సరంలో శిల్పాశెట్టి కంపెనీకి చెందిన 16 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. ఒక్క షేరు కోసం రూ.41.86 వెచ్చించాల్సి వచ్చింది. కంపెనీలో ఆమె మొత్తం వాటా 0.52 శాతం.

Read Also:Rithu Chowdary : టెంప్టింగ్ పోజులతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ..

మామా ఎర్త్‌ను 2016లో వరుణ్, గజల్ అలఘ్ ప్రారంభించారు. వీరిద్దరు భార్యభర్తలు. వీరి కంపెనీ గురుగ్రామ్ లో ఉంది. ఇది చర్మ సంరక్షణ, బేబీకేర్ యునికార్న్స్ సంబంధిత ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఈ కంపెనీకి యునికార్న్ ట్యాగ్ వచ్చింది. మార్చి 2022లో మొత్తం ఫైనాన్షియల్‌లో కంపెనీ లాభం రూ.14 కోట్లు. అదే సమయంలో 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.943 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఇది రూ.456 కోట్లుగా ఉంది. షార్క్ ట్యాంక్ ఇండియా మొదటి సీజన్‌లో గజల్ అలఘ్ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

Read Also:Disha Patani: బాబోయ్ పాప..వర్షంలో తడుస్తూ నేలపై బికినీలో అరాచకం ఏంటి?

శిల్పాశెట్టి కంపెనీ ఐపీఓ కొనాలంటే డీమ్యాట్ ఖాతా ఉండటం చాలా ముఖ్యం. మీరు ఏదైనా బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ ఖాతాను తెరవవచ్చు. IPO జారీ చేసే కంపెనీ తన IPOని పెట్టుబడిదారుల కోసం 3-10 రోజుల పాటు తెరుస్తుంది. ఆ రోజుల్లో పెట్టుబడిదారులు కంపెనీ సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా బ్రోకరేజ్ సంస్థ సహాయంతో IPOలో పెట్టుబడి పెట్టవచ్చు.