IPL vs PSL: నిన్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభమైంది. మొదటి రోజే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇజ్జత్ మొత్తం తీసుకుంది. తొలి రోజు పలు కారణాల వల్ల వైట్ బాల్ కాస్త పింక్ బాల్‌గా మారిపోయింది. ఈ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ ప్రారంభమైంది. షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్ జట్టు, మార్నస్ లాబుషేన్ సారథ్యంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది. మరోవైపు.. రేపు ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇండియన్ ప్రీమియర్ లీడ్(IPL) vs పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రస్తావన వచ్చింది. ఈ రెండింటీ నెటిజన్లు పోలుస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పుడు చర్చిద్దాం.. సింపుల్‌గా చెప్పాలంటే మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి చేయడానికి డబ్బుల ప్రాధాన్యత గురించి తెలిసిందే. బీబీసీ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డబ్బుల విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఇక ప్లేయర్స్ విషయంలోనూ భారత్ ముందుంది. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 16,700 కోట్లు ($1.78 Billion). పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోని మొత్తం 8 జట్లు ఫ్రాంచైజీల విలువ కేవలం PKR 882 కోట్ల పాకిస్థాన్ రూపాయలు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. ఐపీఎల్ (IPL) మొత్తం 10 ఫ్రాంచైజీల ఉమ్మడి విలువ సుమారు $11.5 బిలియన్ల (దాదాపు ₹96,000 కోట్లు) పైమాటే ఉంటుంది. ఈ లెక్కలు విన్నాక “బాప్ బాప్ హోతాహై.. బేటా బేటా హోతాహై” అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది.
READ MORE: Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?
