NTV Telugu Site icon

IPL Mega Auction LIVE Updates: కోట్ల వర్షం..అందరి కళ్లు.. ఈ ప్లేయర్లపైనే

Ipl

Ipl

ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.

  • 24 Nov 2024 10:21 PM (IST)

    గుజరాత్ జెయింట్స్ కుమార్ కుషాగ్రాను తీసుకుంది..

    కుమార్ కుషాగ్రాను గుజరాత్ టైటాన్స్ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 10:20 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న అశుతోష్ శర్మ..

    అశుతోష్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గతేడాది అశుతోష్ బ్యాట్‌తో సంచలనం సృష్టించాడు. అతని బేస్ ధర 30 లక్షలు. ఆర్సీబీ, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ అశుతోష్ కోసం వేలంలో పోటీ పడ్డాయి. ఢిల్లీ 3 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 10:17 PM (IST)

    గుజరాత్‌కు మహిపాల్ లోమ్రోర్..

    మహిపాల్ లోమ్రోర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 1 కోటి 70 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 10:07 PM (IST)

    సీఎస్కేకు విజయ్ శంకర్..

    చెన్నై సూపర్ కింగ్స్ విజయ్ శంకర్‌ను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 10:06 PM (IST)

    మరోసారి పంజాబ్‌కే..

    హర్‌ప్రీత్ బ్రార్ మరోసారి పంజాబ్ కింగ్స్ తరుఫున ఆడనున్నాడు. వేలంలో రూ. 1 కోటి 50 లక్షలకు సొంతం చేసుకుంది.

  • 24 Nov 2024 10:03 PM (IST)

    ఈసారి లక్నోకు ఆడనున్న అబ్దుల్ సమద్..

    అబ్దుల్ సమద్‌ ఈసారి లక్నోకు ఆడనున్నాడు. అతని కోసం ఆర్సీబీ, లక్నో, పంజాబ్ పోటీపడ్డాయి. అతని బేస్ ధర 25 లక్షలు. 50 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 577 పరుగులు చేశాడు. రూ.4 కోట్ల 20 లక్షలకు లక్నో కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 10:02 PM (IST)

    ముంబై ఇండియన్స్‌కి నమన్ ధీర్..

    నమన్ ధీర్ కోసం ముంబై, రాజస్థాన్, పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ గట్టి పోటీ పడ్డాయి. నమన్ బేస్ ధర 30 లక్షలు. రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ. 3 కోట్ల 40 లక్షల బిడ్ చేసింది. ఆ తర్వాత ముంబై ఆర్‌టిఎమ్‌ని ఉపయోగించింది. దీంతో.. రాజస్థాన్ రూ. 5.25 కోట్ల బిడ్‌ను దాఖలు చేసింది.. ముంబై దానిని అంగీకరించింది. నమన్ మరోసారి ముంబై తరఫున ఆడనున్నాడు.

  • 24 Nov 2024 09:57 PM (IST)

    ఢిల్లీకి సమీర్ రిజ్వీ..

    అన్‌క్యాప్డ్ సమీర్ రిజ్వీ రాబోయే సీజన్‌లో ఢిల్లీ తరపున ఆడనున్నాడు. సీఎస్కే, ఢిల్లీ అతని కోసం పోటీ పడ్డాయి. చివరకు క్యాపిటల్స్ అతనిని రూ.95 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 09:56 PM (IST)

    రూ. 30 లక్షలకు నిశాంత్ సింధు గుజరాత్ కొనుగోలు..

    నిశాంత్ సింధును గుజరాత్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 09:55 PM (IST)

    ఎస్ఆర్‌హెచ్‌కు అభినవ్ మనోహర్..

    అభినవ్ మనోహర్ బేస్ ధర రూ. 30 లక్షలు. అతని కోసం ఆర్సీబీ, సీఎస్కే పోటీ పడినప్పటికీ.. రూ. 3 కోట్ల 20 లక్షలకు మనోహర్‌ను సన్ రైజర్స్ తీసుకుంది.

  • 24 Nov 2024 09:39 PM (IST)

    కరుణ్ నాయర్‌ను ఢిల్లీ తీసుకుంది..

    ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కరుణ్ నాయర్‌ను కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 09:38 PM (IST)

    కోల్‌కతా జట్టుకు అంగ్క్రిష్ రఘువంశీ..

    అన్‌క్యాప్డ్ అంగ్క్రిష్ కోసం కోల్‌కతా, చెన్నై భారీగా వేలం వేశాయి. రఘువంశీ బేస్ ధర 30 లక్షలు. కోల్‌కతా మూడు కోట్లకు అతడిని తమ జట్టులో చేర్చుకుంది.

  • 24 Nov 2024 09:33 PM (IST)

    మంచి ధరకు నేహాల్ వధేరా..

    నేహాల్ వధేరా బేస్ ధర రూ. 30 లక్షలు. అతని కోసం సీఎస్కే, పంజాబ్, గుజరాత్, లక్నో వేలంలో పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ అత్యధికంగా రూ.4 కోట్ల 20 లక్షలకు బిడ్ చేసింది.

  • 24 Nov 2024 09:31 PM (IST)

    అథర్వ తైదేను ఎస్ఆర్‌హెచ్ తీసుకుంది

    అథర్వ తైదేను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 09:07 PM (IST)

    భారీ ధరకు అఫ్ఘాన్ స్పిన్నర్..

    నూర్ అహ్మద్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ భారీ వేలం వేసింది. ముంబై రూ. 5 కోట్ల వరకు వేలం వేయగా.. గుజరాత్ ఆర్టీఎం ఉపయోగించుకోగా.. సీఎస్కే బిడ్ రెండింతలను ఉపయోగించింది. దీంతో.. రూ.10 కోట్లకు నూర్‌ను సీఎస్కే తీసుకుంది.

  • 24 Nov 2024 09:05 PM (IST)

    రాజస్థాన్‌కు వనిందు హసరంగా..

    రాజస్థాన్ రాయల్స్ శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగాను రూ. 5 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 08:53 PM (IST)

    సన్ రైజర్స్ జట్టులోకి ఇద్దరు స్పిన్నర్లు.

    స్పిన్నర్లు రాహుల్ చాహర్, జంపాను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రాహుల్ కోసం రూ.3.20 కోట్లు, ఆడమ్ కోసం రూ.2.40 కోట్లు ఫ్రాంచైజీ వెచ్చించింది.

  • 24 Nov 2024 08:47 PM (IST)

    ఆర్ఆర్ జట్టులో మహిష్ తీక్షణ..

    మహిష్ తీక్షణ రాబోయే సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. రూ. 4 కోట్ల 40 లక్షలకు రాజస్థాన్ తీసుకుంది.

  • 24 Nov 2024 08:46 PM (IST)

    ముంబై జట్టులో బోల్ట్..

    ట్రెంట్ బౌల్డ్ కోసం వేలంలో గట్టి పోటీ జరిగింది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ మధ్య బిడ్ జరగగా.. ముంబై ఇండియన్స్ బోల్ట్‌ను రూ.12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 08:39 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్‌కు నటరాజన్..

    ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ బేస్ ధర రూ. 2 కోట్లు. హైదరాబాద్, ఆర్‌సీబీ, ఢిల్లీ అతని కోసం వేలంలో పోటీపడ్డాయి. నటరాజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ చివరి బిడ్ వేసింది. రూ.10 కోట్ల 75 లక్షలకు నటరాజన్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 08:33 PM (IST)

    సీఎస్కే జట్టులోకి ఖలీల్ అహ్మద్‌..

    ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ చెన్నైకి ఆడనున్నాడు. అతన్ని సీఎస్కే రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 08:30 PM (IST)

    జోఫ్రా ఆర్చర్‌ను సొంతం చేసుకున్న ఆర్ఆర్..

    జోఫ్రా ఆర్చర్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ.12.50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాడు.

  • 24 Nov 2024 08:26 PM (IST)

    ఎన్రిక్ నార్కియా కోసం బిడ్డింగ్ వార్..

    ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియా కోసం కోల్‌కతా, లక్నో పోటీ పడ్డాయి. రూ.6 కోట్ల 50 లక్షలకు కోల్‌కతా తమ జట్టులోకి తీసుకుంది.

  • 24 Nov 2024 08:22 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు అవేష్ ఖాన్..

    ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వేలం వేసాయి. రూ.9.75 కోట్లకు అవేశ్‌ను లక్నో కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 08:16 PM (IST)

    గుజరాత్‌లోకి ప్రసిద్ధ్ కృష్ణ..

    ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. అతని కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోటీ జరగగా.. చివరకు గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.9 కోట్ల 50 లక్షలకు తమ జట్టులోకి చేర్చుకుంది.

  • 24 Nov 2024 08:11 PM (IST)

    ఆర్సీబీకి జోష్ హేజిల్‌వుడ్..

    ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. రూ.12 కోట్ల 50 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది.

  • 24 Nov 2024 08:09 PM (IST)

    జితేష్ శర్మకు మంచి ధర..

    వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ బేస్ ధర రూ. 1 కోటి. సీఎస్కే, లక్నో, ఆర్సీబీ అతని కోసం పోటీ పడ్డాయి. ఏడు కోట్లకు ఆర్సీబీ తీసుకుంది. పంజాబ్ కింగ్స్ ఆర్టీఎంను ఉపయోగించుకున్నప్పటికీ.. ఆర్సీబీ అతనిని 11 కోట్లకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 08:00 PM (IST)

    ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్..

    గత కొన్ని సీజన్లుగా ముంబై తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్‌ను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. రూ. 11.25 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 07:52 PM (IST)

    కోల్‌కతాకు గుర్బాజ్..

    రహ్ముల్లా గుర్బాజ్‌ను బేస్ ప్రైస్ ధర రూ.2 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 07:51 PM (IST)

    ఫిల్ సాల్ట్‌పై భారీ బిడ్డింగ్

    డాషింగ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ కోసం ముంబై, ఆర్సీబీ పోటీ పడ్డాయి. కోల్‌కతా రూ.7.75 కోట్లకు తొలి బిడ్ వేసింది. ఫిల్ సాల్ట్ బేస్ ధర 2 కోట్లు. ఆ తర్వాత.. ఆర్సీబీ రూ.11.50 కోట్లకు సాల్ట్‌ను కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 07:42 PM (IST)

    అమ్ముడుపోని బెయిర్‌స్టో..

    ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

  • 24 Nov 2024 07:41 PM (IST)

    కేకేఆర్‌కు క్వింటన్ డి కాక్..

    వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై మధ్య బిడ్డింగ్ వార్ నడిచింది. చివరకు రూ. 3.60 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 07:29 PM (IST)

    గ్లెన్ మాక్స్‌వెల్‌కు తగ్గిన ధర..

    ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. అతని కోసం హైదరాబాద్, పంజాబ్‌లు వేలం వేసాయి. మ్యాక్స్‌వెల్ బేస్ ధర రూ.2 కోట్లు. పంజాబ్ కింగ్స్ రూ.4.20 కోట్లకు బిడ్ చేసింది.

  • 24 Nov 2024 07:20 PM (IST)

    మిచెల్ మార్ష్‌కు రూ. 3.40 కోట్లు..

    మిచెల్ మార్ష్ కోసం హైదరాబాద్, లక్నో పోటీ పడ్డాయి. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ మార్ష్‌ను రూ.3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 07:17 PM (IST)

    మార్కస్‌ను చేజిక్కించుకున్న పంజాబ్ కింగ్స్..

    పంజాబ్ కింగ్స్ తమ జట్టులో మార్కస్ స్టోయినీస్‌ను చేర్చుకుంది. ఆర్సీబీ, సీఎస్కే, పంజాబ్ ఈ ఆటగాడి కోసం పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 07:08 PM (IST)

    వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్..

    మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్ సంచలనం రేపాడు. అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రూ. 23.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. వెంకటేష్ అయ్యర్ కోసం
    ఆర్సీబీ, కేకేఆర్ పోటీ పడింది. చివరకు కోల్‌కతా సొంతం చేసుకుంది.

  • 24 Nov 2024 07:01 PM (IST)

    భారీ ధరకు అశ్విన్..

    స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్‌ను సీఎస్కే సొంతం చేసుకుంది. రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. అశ్విన్ కోసం రాజస్థాన్ ఫ్రాంచైజీ పోటీ పడింది. చివరకు చెన్నైకు సొంతం అయ్యాడు.

  • 24 Nov 2024 06:55 PM (IST)

    పాత జట్టులోకే..

    రచిన్ రవీంద్రను సీఎస్కే సొంతం చేసుకుంది. రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ ఫ్రాంచైజీ పోటీ పడినప్పటికీ.. ఆర్టీఎం పద్థతిలో సీఎస్కే సొంతం చేసుకుంది.

  • 24 Nov 2024 06:51 PM (IST)

    హర్షల్ పటేల్‌ను సొంతం చేసుకున్న ఎస్ఆర్‌హెచ్..

    హర్షల్ పటేల్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. హర్షల్ కోసం పంజాబ్ కూడా పోటీ పడింది. చివరకు హైదరాబాద్ దక్కించుకుంది.

  • 24 Nov 2024 06:46 PM (IST)

    జేక్ ఫ్రేజర్- మెక్‌గర్క్‌కు భారీ ధర..

    యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్- మెక్‌గర్క్‌ను ఆర్టీఎంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని కోసం పంజాబ్ ఫ్రాంచైజీ పోటీ పడింది.

  • 24 Nov 2024 06:44 PM (IST)

    వార్నర్‌ను తీసుకోని ఏ జట్టు..

    పలు ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించిన స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు తీసుకురాలేదు. దీంతో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.

  • 24 Nov 2024 06:40 PM (IST)

    చెన్నై జట్టుకు రాహుల్ త్రిపాఠి..

    రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. బేస్ ధర రూ. 75 లక్షలు ఉండగా.. సీఎస్కే, కేకేఆర్ పోటీ పడి చెన్నై రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 06:37 PM (IST)

    సీఎస్కేకు కాన్వే..

    డెవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది.

  • 24 Nov 2024 06:35 PM (IST)

    బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకున్న లక్నో..

    గత సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఐడెన్ మార్క్రమ్‌కు డిమాండ్ లభించలేదు. అతన్ని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే లక్నో సొంతం చేసుకుంది.

  • 24 Nov 2024 06:33 PM (IST)

    దేవ్ దత్ పడిక్కల్ అన్ సోల్డ్..

    దేవ్‌దత్ పడిక్కల్ అన్ సోల్డ్‌గా నిలిచాడు. బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు ఎవరు కొనుగోలు చేయలేదు.

  • 24 Nov 2024 06:31 PM (IST)

    హ్యారీ బ్రూక్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్

    ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.

  • 24 Nov 2024 05:26 PM (IST)

    ఢిల్లీకి కేఎల్ రాహుల్..

    స్టార్ బ్యాట్స్‌మెన్ KL రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను సొంతం చేసుకుంది.

  • 24 Nov 2024 05:19 PM (IST)

    ఆర్సీబీలోకి లివింగ్ స్టోన్..

    ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. రూ.8.75 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.

  • 24 Nov 2024 05:13 PM (IST)

    హైదరాబాదీ ఆటగాడు ఆ జట్టుకే..

    హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను దక్కించుకుంది.

  • 24 Nov 2024 04:59 PM (IST)

    పంజాబ్‌లోకి చాహల్..

    స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ. 18 కోట్లకు దక్కించుకుంది.